అల్లరి నరేశ్, నటించిన తాజా చిత్రం ’12ఏ రైల్వే కాలనీ’ (12A Railway Colony). నవంబర్ 21న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా, ఇప్పుడు, ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) వేదికగా ఈ చిత్రం ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో విడుదలైన మూడు వారాలకే డిజిటల్ ప్రీమియర్ కావడం గమనార్హం.తెలుగుతో పాటు దక్షిణాది భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.
Read Also: Nagarjuna: నాగార్జునపై విజయ్ సేతుపతి సరదా వ్యాఖ్యలు
విమర్శకుల ప్రశంసలు
నరేష్, కామాక్షి భాస్కర్లతో పాటు డైలాగ్ కింగ్ సాయి కుమార్, వైవా హర్ష, గెటప్ శ్రీను, సద్దాం, జీవన్ కుమార్, మధుమణి, గగన్ విహారి, అనీష్ కురువిల్లా తదితరులు కీలక పాత్రలు పోషించారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస చిట్టూరి మూవీని (12A Railway Colony) నిర్మించారు. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందించారు.

కథేంటంటే
వరంగల్ రైల్వే కాలనీలో నివసించే అనాథ కార్తీక్ (అల్లరి నరేశ్), స్థానిక రాజకీయ నాయకుడికి నమ్మినబంటుగా ఉంటాడు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన ఆటల పోటీల్లో ఆరాధన (కామాక్షి భాస్కర్ల)ను చూసి ప్రేమలో పడతాడు. అయితే ఆరాధన ఎవరు? ఆమె గతం ఏమిటి? ఆమె తన భార్య అంటూ కథలోకి ప్రవేశించిన జయదేవ్ షిండే ఎవరు? అనే ఆసక్తికరమైన అంశాలతో ఈ సినిమా సాగుతుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: