ప్రముఖ బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నా (Akshaye Khanna) ఏ పాత్రలో అయినా చక్కగా ఇమిడిపోగలడు. తాజాగా విడుదలైన ‘దురంధర్’ చిత్రం లో పాకిస్తాన్ గ్యాంగ్ స్టర్ రెహ్మాన్ డెకాయిత్ పాత్రలో ఆయన నటనకు ప్రేక్షకులతో పాటు విమర్శకుల నుంచి కూడా మంచి ప్రశంసలు లభించాయి. ఇప్పుడు, ఆయన ‘మహాకాళి’ అనే తెలుగు సినిమాలో ఆరంగేట్రం చేయనున్నారు. ‘హనుమాన్’ సినిమాతో పాన్ ఇండియా ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న దర‍్శకుడు ప్రశాంత్ వర్మ, ప్రస్తుతం ‘జై హనుమాన్’ చిత్ర పనుల్లో బిజీగా ఉన్నారు.
Read also: Naveen Polishetty: పెళ్లిపై తనదైన స్టైల్లో సమాధానం చెప్పిన నవీన్
నెగెటివ్ షేడ్ ఉన్న పాత్రలో
ఇటీవలే ‘మహాకాళి’ మూవీని అధికారంగా ప్రకటించారు. ఈ చిత్రానికి స్టోరీ ప్రశాంత్ వర్మ అందించగా, పూజ కొల్లూరు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో భూమి శెట్టి ప్రధాన పాత్ర పోషిస్తుండగా, అక్షయ్ ఖన్నా (Akshaye Khanna) నెగెటివ్ షేడ్ ఉన్న పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. దురంధర్ సినిమా సీక్వెల్ 2026 మార్చి 19న విడుదల కానుంది.

Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: