అక్కినేని ఫ్యామిలీలో వరుసగా శుభకార్యాలు జరుగుతున్నాయి. తాజాగా నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్ల వివాహం గ్రాండ్‌గా జరగగా, ఇప్పుడు అక్కినేని అఖిల్ వివాహానికి సన్నాహాలు జరుగుతున్నాయి.2023 డిసెంబర్ 4న అక్కినేని నాగ చైతన్య, నటి శోభిత ధూళిపాళ్ల వివాహం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో ఘనంగా జరిగింది. పెళ్లి తర్వాత నాగ చైతన్య నటించిన “తండేల్” సినిమా పెద్ద విజయాన్ని సాధించింది. చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రం నాగ చైతన్య కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది.ఈ సినిమాలో నాగ చైతన్య అద్భుతంగా నటించి మెప్పించాడు.ఇక ఇప్పుడు అక్కినేని ఫ్యామిలీ మరో గుడ్ న్యూస్ పంచుకుందని సోషల్ మీడియాలో , ఫిలిం సర్కిల్స్ లో తెగ చక్కర్లు కొడుతుంది. మరోసారి అక్కినేని ఇంట పెళ్ళిసందడి మొదలవ్వనుంది. నాగచైతన్య పెళ్లి సమయంలోనే అఖిల్ కూడా తన ప్రేయసితో ఎంగేజ్ మెంట్ చేసుకున్నాడు. ఇన్ని రోజులు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఉన్న అఖిల్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఇటీవలే జైనాబ్ రవడ్జీ అనే అమ్మాయితో అఖిల్ ఎంగేజ్ మెంట్ జరిగింది.ఈ విషయాన్ని స్వయంగా నాగార్జున సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. అఖిల్, జైనబ్ నిశ్చితార్థ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఇప్పుడు, ఈ ప్రేమజంట పెళ్లి తేదీ కూడా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లోని నాగార్జున ఇంట్లో కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ వేడుక జరిగింది. అక్కినేని అఖిల్ నిశ్చితార్థం విషయాన్నినాగార్జునే స్వయంగా సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించారు.2025 మార్చి 24న అఖిల్-జైనబ్ వివాహం జరగనుందని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఇరు కుటుంబాలు దీని గురించి చర్చలకు కూడా జరుపుకొని తేదీని ఫిక్స్ చేశారని టాక్. అఖిల్-జైనల్‌ల వివాహం ఘనంగా చేసేందుకు నాగార్జున ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. ఈ వివాహ వేడుకకు ఎంతో మంది ప్రముఖులు రానున్నారని అంటున్నారు. సినీ సెలబ్రెటీలు, రాజకీయ ప్రముఖులతో పాటు క్రికెటర్స్ ను కూడా వీరి వివాహానికి ఆహ్వానించనున్నారని తెలుస్తుంది. త్వరలోనే దీని పై క్లారిటీ రానుంది. ప్రస్తుతం అఖిల్ సీసీఏల్(సెలెబ్రిటీ క్రికెట్ లీగ్) లో బిజీగా ఉన్నాడు. అలాగే త్వరలోనే కొత్త సినిమాను కూడా అనౌన్స్ చేయనున్నాడు.
పెళ్లి సందడి
అక్కినేని ఇంట వరుసగా పెళ్లిళ్ల సందడి నెలకొనడంతో అభిమానులు సైతం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో చైతన్య-శోభిత, అఖిల్-జైనబ్ జంటల ఫోటోలు వైరల్‌గా మారాయి. పెళ్లి వేడుకలతో పాటు అక్కినేని వారసుల సినిమాలపై కూడా ఆసక్తి పెరిగింది.