నవంబర్ 21న విడుదలైన రాజు వెడ్స్ రాంబాయి సినిమా (Raju Weds Rambai movie) సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో ఎమోషనల్ బ్యాక్‌డ్రాప్‌లో సహజమైన నటనతో ఆడియన్స్‌ను ఆకట్టుకున్న ఈ యువ హీరో అఖిల్ రాజ్ (Akhil Raj), తన నటనా సత్తాను చాటాడు. అంతకుముందే పలు షార్ట్ ఫిలిమ్స్‌లో నటించి అనుభవం సంపాదించిన అఖిల్ రాజ్‌కు రాజు వెడ్స్ రాంబాయితోనే బ్రేక్ వచ్చిందని చెప్పాలి.
Read Also: Telugu Film Chamber: ప్రారంభమైన ఎన్నికల పోలింగ్
హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్
ఇక తాజాగా విడుదలైన ఈషా సినిమాతో మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు అఖిల్ రాజ్. (Akhil Raj) ఈ వరుస విజయాలతో ఇప్పుడు అతడికి అవకాశాలు క్యూ కడుతున్నాయనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ తెరకెక్కించనున్న కొత్త సినిమాలో హీరోగా నటించనున్నారు.

ఈ చిత్రంలో స్టార్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్యూర్ ఎమోషనల్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందనున్న ఈ సినిమాకు అఖిల్ రాజ్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. వచ్చే ఏడాది సమ్మర్‌లో సినిమా విడుదలయ్యే అవకాశాలున్నాయని సమాచారం.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: