
నందమూరి బాలకృష్ణ హీరోగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన పాన్ ఇండియా చిత్రం ‘అఖండ 2 తాండవ’ థియేటర్లలో సందడి మొదలుపెట్టింది. అనేక అడ్డంకులు దాటుకుని ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. డిసెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుండగా, గురువారం రాత్రి ప్రత్యేక ప్రీమియర్ షోలు నిర్వహించారు. ఈ షోలకు అభిమానుల నుంచి ఊహించని స్థాయిలో స్పందన లభిస్తోంది.
Read Also: OTT Movie: ఓటీటీలోకి రాజు వెడ్స్ రాంబాయి’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
బాలయ్య – బోయపాటి కలయికలో ఇది నాలుగో చిత్రం కావడం, అలాగే సూపర్ హిట్ మూవీ ‘అఖండ 2’కు సీక్వెల్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. వాస్తవానికి డిసెంబర్ 5న విడుదల కావాల్సిన ఈ సినిమా కొన్ని కారణాల వల్ల వారం ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అయినప్పటికీ ప్రీమియర్ షోల నుంచే పాజిటివ్ బజ్ క్రియేట్ అవుతోంది.
ప్రత్యేక షోల తర్వాత సోషల్ మీడియాలో సినిమాపై చర్చ మొదలైంది. బాలకృష్ణ నటన, మాస్ ఎలివేషన్లు, బోయపాటి మార్క్ యాక్షన్ సీన్స్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయని ట్విట్టర్ రివ్యూల్లో వెల్లడవుతోంది. బాలయ్య – బోయపాటి కాంబో మరోసారి సక్సెస్ ట్రాక్ కొనసాగించిందా? ‘అఖండ’ మ్యాజిక్ మరోసారి పనిచేసిందా? అనే విషయాలపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.
తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక థియేటర్లలో ప్రీమియర్ షోలు ప్రదర్శించడంతో సినిమా హాళ్లు అభిమానులతో నిండిపోయాయి. సుమారు 2 గంటల 45 నిమిషాల నిడివితో తెరకెక్కిన ఈ చిత్రానికి నందమూరి అభిమానుల నుంచి హోరెత్తిన స్పందన వస్తోంది. థియేటర్లు మొత్తం ‘జై బాలయ్య’ నినాదాలతో మారుమోగుతున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read also :