బాలకృష్ణ–బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘అఖండ 2’(Akhanda 2) డిసెంబర్ 5న విడుదల కానుందంటూ ముందే ప్రకటించారు. అయితే షూటింగ్, డబ్బింగ్ పూర్తయినప్పటికీ, ప్రమోషన్లు ఇంకా ప్రారంభం కాకపోవడంతో సినిమా వాయిదా పడే ప్రచారం టాలీవుడ్‌లో బలంగా మొదలైంది. భారీ హైప్ ఉన్న సినిమాలో ఇంత సైలెన్స్ ఉండటమే అనుమానాలను పెంచుతోంది.
Read Also: Kantha Movie: దుల్కర్ సల్మాన్ కాంత మూవీ రివ్యూ

మళ్లీ బాలయ్య–చిరు సంక్రాంతి పోటీ?
ఇండస్ట్రీ టాక్ ప్రకారం ‘అఖండ 2’(Akhanda 2) టీమ్ సంక్రాంతి సీజన్‌ను లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో ప్రభాస్ ‘ది రాజాసాబ్’ పనులు ఆలస్యం కావడంతో ఆ సినిమా వాయిదా పడే అవకాశం ఉందని మాట్లాడుకుంటున్నారు. అలాంటప్పుడు ఖాళీ అయ్యే జనవరి స్లాట్‌ను ‘అఖండ 2’ దక్కించుకోవచ్చని సమాచారం. ఇలా జరిగితే బాలయ్య–చిరంజీవి మరోసారి సంక్రాంతి బరిలో పోటీపడే అవకాశం ఉంది. గతంలో ‘వీరసింహారెడ్డి’ – ‘వాల్తేరు వీరయ్య’ పోటీ ఎంత హైప్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే.
బాలయ్య–బోయపాటి కాంబోపై భారీ అంచనాలు
‘సింహా’, ‘లెజెండ్’(‘Legend’), ‘అఖండ’ సినిమాలతో మాస్ రేంజ్‌ను పెంచిన బాలయ్య–బోయపాటి కాంబినేషన్‌పై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. 14 రీల్స్ ప్లస్ నిర్మిస్తున్న ఈ భారీ సీక్వెల్‌లో బాలయ్య ఆఘోరా లుక్ మరింత శక్తివంతంగా కనిపించబోతుందనే ఫస్ట్ గ్లిమ్స్‌తో అభిమానుల్లో హైప్ పెరిగింది.
సీమల్లో రచ్చకు రెడీ?
‘అఖండ 2’ వాయిదా పడితే, సంక్రాంతి సీజన్‌లో మళ్లీ టాలీవుడ్‌లో భారీ హంగామా నెలకొననుంది.
- బాలయ్య – రౌద్ర నృసింహ స్వరూపం
- చిరంజీవి – ‘మన్ శంకరవరప్రసాద్ గారు’తో ఫ్యామిలీ & మాస్ ఫ్లేవర్
రెండు భారీ సినిమాలు ఒకే సమయంలో వస్తే బాక్సాఫీస్ కలెక్టర్, ఫ్యాన్స్ సెలబ్రేషన్స్, సోషల్ మీడియా డిబేట్లు దుమ్ములేపడం ఖాయం. ఈ శుక్రవారం ‘అఖండ 2’ ఫస్ట్ సింగిల్ విడుదల అవుతోంది.అదే రిలీజ్ డేట్‌పై తుది క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ టాక్.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: