టాలీవుడ్లో “దేశముదురు” సినిమాతో అందాలను ఆరబోసి కుర్రకారుని కట్టిపడేసిన హన్సిక మోత్వాని ఇప్పుడు పలు కారణాలతో వార్తల్లో నిలుస్తోంది. ఈ అందాల తార బాలీవుడ్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా తన ప్రయాణం మొదలు పెట్టి, దేశముదురు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. తెలుగులోనే కాకుండా, తమిళ చిత్రాల్లోనూ తనదైన ముద్ర వేసిన ఈ భామ, ఇక్కడి వరకు బాగానే ఉన్నా, తాజాగా వ్యక్తిగత జీవితంలో ఓ గొప్ప చిక్కుముడి ఎదుర్కొంటోంది. హన్సిక సోదరుడు ప్రశాంత్ భార్య ముస్కాన్ ఆమెపై, ఆమె కుటుంబసభ్యులపై గృహ హింస కేసు నమోదు చేయడం టాలీవుడ్‌తో పాటు ఇతర ఇండస్ట్రీల్లోనూ హాట్ టాపిక్ అయింది.

ప్రశాంత్, ముస్కాన్ 2021లో ప్రేమ వివాహం చేసుకున్నారు.కానీ వారి మధ్య వచ్చిన విభేదాలు ఇప్పుడు తీవ్రమయ్యాయి. ముస్కాన్ తాజాగా డిసెంబర్ 18న ముంబైలోని అంబోలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదు చేసింది.ఫిర్యాదులో ముస్కాన్ పేర్కొన్న వివరాల ప్రకారం, తన వైవాహిక జీవితంలో హన్సికతో పాటు ఆమె కుటుంబసభ్యులు జోక్యం చేసుకోవడం వల్లే సమస్యలు తలెత్తాయని ఆమె ఆరోపించింది. హన్సిక కుటుంబ సభ్యులు తనను మానసికంగా, శారీరకంగా హింసించారని ఫిర్యాదులో వివరించింది. ఈ కేసు ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.తెలుగులో “దేశముదురు” సినిమాతో భారీ హిట్ కొట్టిన హన్సిక, ఆ తర్వాత వరుస చిత్రాల్లో నటించింది.
ఆమె నటించిన సినిమాలు తెలుగు, తమిళ భాషల్లో మంచి విజయాలు సాధించాయి. కానీ ఇటీవల ఆమె చేసిన లేడీ ఓరియెంటెడ్ సినిమాలు ఆశించినంత సక్సెస్ సాధించలేకపోయాయి.ప్రస్తుతం హన్సిక టీవీ షోలలో జడ్జ్‌గా వ్యవహరిస్తోంది. టీవీ షోల ద్వారా తాను ప్రేక్షకులకు మరింత చేరువ అవ్వాలని చూస్తోంది. హన్సిక తన సినీ కెరీర్‌తో పాటు వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల కారణంగా మీడియా హైలైట్ అవుతోంది. హన్సిక అభిమానులు ఈ కేసు విషయంలో తమ స్టార్‌పై మద్దతు చూపిస్తున్నారు. సోషల్ మీడియాలో ఆమెకు మద్దతుగా పోస్టులు పెడుతున్నారు.