हिन्दी | Epaper
భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్ భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్ భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్ భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్

శ్రుతీహాసన్ గోత్ థీమ్‌తో సరికొత్తగా ఈ అమ్మడు.

Divya Vani M
శ్రుతీహాసన్ గోత్ థీమ్‌తో సరికొత్తగా ఈ అమ్మడు.

టాలీవుడ్, కోలీవుడ్ ప్రేక్షకులకు చిరపరిచితమైన పేరు శ్రుతీ హాసన్.తెలుగుతో పాటు తమిళ సినిమాల్లోను తన అద్భుత నటనతో మెప్పించిన ఈ నటి,ఇటీవలే సూపర్ హిట్ మూవీ సలార్ లో కనిపించింది.ప్రభాస్ హీరోగా, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచినప్పటికీ,శ్రుతీ కొత్త ప్రాజెక్ట్ గురించి ఇంకా అధికారికంగా ఏ ప్రకటన చేయలేదు.అయితే,ప్రస్తుతం క్రిస్మస్ సెలబ్రేషన్స్‌తో నటి శ్రుతి హాసన్ మరోసారి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.తనదైన స్టైల్లో యాక్టివ్‌గా ఉంటూ వార్తల్లో నిలిచే శ్రుతి,ఈసారి క్రిస్మస్ పండుగను గోత్ థీమ్‌లో జరుపుకుంటోంది.ఫొటోలలో శ్రుతి తన అందంతో పాటుప్రత్యేకమైన ఫ్యాషన్ స్టైల్‌తో అదరగొట్టింది.సినిమాల విషయానికొస్తే, 2023 శ్రుతి హాసన్ కెరీర్‌లో మరచిపోలేని సంవత్సరం. వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి, సలార్ పార్ట్ 1 చిత్రాలతో ఆమె భారీ విజయాలు సాధించింది. ఈ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయిలో వసూళ్లు రాబట్టాయి. అయితే, 2024లో మాత్రం ఆమె నుంచి విడుదలైన కొత్త చిత్రాలు లేవు.

తన దైన గ్లామర్, న‌ట‌న‌తో అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న శ్రుతి, 2025లో రాబోయే క్రేజీ చిత్రాలతో స్క్రీన్‌ను షేక్ చేయనుంది. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కూలీ చిత్రంలో ఆమె ప్రధాన పాత్రలో కనిపించనుంది. ఇది పాన్ ఇండియా లెవెల్ లో భారీ హైప్‌ను క్రియేట్ చేసింది. అలాగే, ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న సలార్ పార్ట్ 2 సినిమా కూడా శ్రుతి ఫ్యాన్స్ కోసం వేచి చూస్తున్న మరో క్రేజీ ప్రాజెక్ట్. ఈ రెండు చిత్రాలు 2025లో ప్రేక్షకులను అలరించనున్నాయని సమాచారం. తాజాగా శ్రుతి పలు క్రేజీ చిత్రాలకు సైన్ చేసినట్లు సమాచారం. తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులకు మరింత సమీపంగా రావాలని ఆమె ఆసక్తిగా ఉంది. ఒకవైపు గ్లామర్ రోల్ చేస్తూనే, విభిన్నమైన పాత్రల ద్వారా ప్రేక్షకులను ఆశ్చర్యపరిచేందుకు సిద్ధమవుతోంది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870