డిసెంబరు 31 తర్వాత నటనకు పూర్తిగా గుడ్‌బై చెబుతున్నట్లు తులసి (Tulasi) ప్రకటించటం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్టు పెట్టిన తులసి, “డిసెంబర్ 31 నుంచే నా రిటైర్మెంట్ జీవితానికి శ్రీకారం. ఆ తర్వాత నా జీవితం మొత్తం సాయిబాబా సేవకే అంకితం” అని ప్రకటించారు. ఆమె నిర్ణయం అభిమానులను ఆశ్చర్యపరచడమే కాకుండా భావోద్వేగానికి గురిచేసింది.
Read Also: Rahul Sipligunj: సీఎం రేవంత్ రెడ్డిని తన పెళ్లికి ఆహ్వానించిన రాహుల్
సినీ జీవితం
తులసి (Tulasi) కేవలం మూడు నెలల పసిపిల్లగానే సినిమాల్లోకి అడుగుపెట్టడం విశేషం. ఆమె తల్లి మహానటి సావిత్రికి సన్నిహితురాలు కావడంతో ‘జీవన తరంగాలు’ చిత్రంలో ఊయలలో కనిపించే శిశువు పాత్ర కోసం తులసి తల్లిని చిత్ర బృందం అభ్యర్థించింది. అలా 1967లోనే ఆమెకు తెలిసీ తెలియకుండానే సినీ జీవితం ప్రారంభమైంది.
నాలుగేళ్లకే బాలనటిగా వరుస చిత్రాల్లో నటిస్తూ పలు భాషల్లో ప్రాచుర్యం పొందింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, భోజ్‌పురి ఇలా ఐదు భాషల్లో అంటే 300కి పైగా సినిమాల్లో ఆమె నటించారు. భాషల మధ్య తేడా లేకుండా పాత్రల పరంగా ఎలాంటి వెనకడుగు లేకుండా ఎదిగిన నటిమణుల్లో తులసి ఒకరు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: