సౌత్‌లో పేరు తెచ్చుకున్న హీరోయిన్లు నార్త్‌కు వెళ్లడం కామన్. స్టార్ హీరోయిన్ల నుంచి కొత్త ఫేస్‌ల వరకూ అందరూ ఈ ట్రెండ్ ఫాలో అవుతున్నారు. ఇప్పుడు అదే దారిలో శ్రీలీల కూడా అడుగేస్తున్నారు. టాలీవుడ్‌లో మురిపించిన ఈ ముద్దుగుమ్మ, బాలీవుడ్ వైపు చూస్తున్నారు.‘పెళ్లి సందడి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన శ్రీలీల, చిన్న టైంలోనే స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్‌లు కొట్టేశారు. మాస్ మహారాజా రవితేజ నుంచి పవన్ కళ్యాణ్ వరకు ఆమె నటించిన సినిమాలు టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాయి. సక్సెస్ పరంగా కొంత వెనకపడినా, అవకాశాల విషయంలో మాత్రం దూసుకుపోతున్నారు.తాజాగా పుష్ప 2లో ఓ స్పెషల్ సాంగ్ చేసింది శ్రీలీల. ఈ “కిసిక్” పాటకు నార్త్‌లోనూ మంచి రెస్పాన్స్ వచ్చింది. బాలీవుడ్ ఆడియన్స్ ఆమెపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అదే అవకాశాన్ని క్యాష్ చేసుకోవడానికి శ్రీలీల బాలీవుడ్ ప్రాజెక్ట్స్‌లో బిజీ అవుతున్నారు.

ఆశిఖీ 3లో కార్తిక్ ఆర్యన్ సరసన
ప్రస్తుతం ఆమె ఆశిఖీ 3లో హీరోయిన్‌గా నటిస్తున్నారు. హీరోగా కార్తీక్ ఆర్యన్ ఉన్న ఈ సినిమాలో ఆమె మెయిన్ లీడ్. ఈ సినిమా కోసం ఎక్కువగా ముంబైలోనే ఉంటున్నారు శ్రీలీల. దీంతో అక్కడి ఫిల్మ్ పార్టీల్లో రెగ్యులర్‌గా కనిపిస్తున్నారు.బీటౌన్ ఈవెంట్స్‌లో మెరిసిపోతూ అక్కడి మీడియా ఫోకస్‌లోకి వచ్చారు. బాలీవుడ్ ఆడియన్స్‌తో కనెక్ట్ అయ్యేందుకు ఇదే సరైన టైం అని భావిస్తున్నారు శ్రీలీల. ఒక్క ఆశిఖీ 3 కాదు, మరికొన్ని ప్రాజెక్ట్స్ లోనూ ఆమె పేరు వినిపిస్తోంది.ఒక ట్రయాంగులర్ లవ్‌స్టోరీలో వరుణ్ ధావన్ సరసన శ్రీలీల నటించనున్నట్టు న్యూస్ వచ్చింది. కానీ వరుణ్ డేట్స్ ఇష్యూస్ వల్ల ప్రాజెక్ట్ వాయిదా పడింది. త్వరలో అదే సినిమా మళ్లీ ట్రాక్‌లోకి వచ్చే అవకాశం ఉంది.
ఇంకా ప్రాజెక్ట్స్ లైన్‌లో
సిద్దార్థ్ మల్హోత్రా హీరోగా తెరకెక్కుతున్న ‘మిట్టీ’ అనే సినిమాలోనూ ఆమె పేరు చర్చలో ఉంది. ఇది ఇంకా అధికారికంగా ప్రకటన అయితే రాలేదు. అదేకాదు, సైఫ్ అలీఖాన్ కుమారుడు ఇబ్రాహీం అలీ ఖాన్‌తో శ్రీలీల కెమెరాల కంటపడిన వీడియోలు వైరల్ అయ్యాయి. దీంతో వీరి కాంబినేషన్‌లోనూ ఓ సినిమా రాబోతుందన్న టాక్ బలంగా వినిపిస్తోంది.ఇటీవల నార్త్ ఇండియాలో శ్రీలీలకు అవకాశాలు పెరుగుతున్నాయి. బాలీవుడ్ డైరెక్టర్లు ఆమె టాలెంట్‌ను నోటీసు చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న బజ్ చూస్తుంటే, బీటౌన్‌లో ఆమెకు ఫ్యూచర్ బ్రైట్‌గా కనిపిస్తోంది!
Read Also : HIT- 3: నాని బ్లాక్ బస్టర్ హిట్-3 ఓటీటీలోకి ఎప్పుడంటే?