లాపతా లేడీస్’ సినిమాతో అందరి మనసుల్ని గెలిచిన నితాన్షి గోయల్ ఇప్పుడు అంతర్జాతీయ వేదికపై తన సత్తా చాటింది. ఈ 17 ఏళ్ల యువనటి కేన్స్ చలనచిత్రోత్సవంలో మొదటిసారి అడుగుపెట్టి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది.Nitanshi Goyal రెడ్ కార్పెట్‌పై మెరిసిన తీరు విశేషం. ఒక సందర్భంలో ఆమె నలుపు, బంగారు రంగుల గౌనులో దర్శనమిచ్చింది. మరొకసారి ముత్యాలు పొదిగిన ప్రీ-డ్రేప్డ్ చీరలో ఆకట్టుకుంది. ఈ చీరకు ఉన్న 3D లేయర్ వర్క్, భారీ పల్లూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పర్ల్ స్ట్రాపీ బ్లౌజ్ ఆమె అందాన్ని రెట్టింపు చేసింది.

నితాన్షి హెయిర్‌స్టైల్‌కు అందరూ ఫిదా!
కేన్స్ స్టైలింగ్‌లో అసలైన హైలైట్ ఆమె హెయిర్‌స్టైల్. ఆమె ముత్యాల జడలో బాలీవుడ్ లెజెండ్స్ ఫొటోలు చేర్చారు. మధుబాల, నర్గీస్, మీనా కుమారి, శ్రీదేవి వంటి తారల ఛాయలు నితాన్షి జడలో తళుక్కుమన్నాయి. ఇది చూసిన ప్రతిఒక్కరూ ఆశ్చర్యపోయారు.ఈ తారలపై తనకున్న ప్రేమను అందరికీ ఈ రూపంలో చూపించింది. ఇది ఫ్యాషన్ మాత్రమే కాదు, గౌరవానికి సూచిక కూడా.
నితాన్షి మాటల్లో ఆమె కేన్స్ ప్రయాణం
తన లుక్స్, డ్రెస్సింగ్ ఎంపికకు పెద్దగా సమయం పట్టలేదంటోంది నితాన్షి. తన ఫ్యాషన్ ఐకాన్ ఐశ్వర్యా రాయ్ అని చెప్పింది. కేన్స్‌లో అలియా భట్ లాగా మెరవాలనేది తన కల అంటుంది.నితాన్షి ఇప్పుడు కేన్స్ రెడ్ కార్పెట్‌పై నడిచిన భారతీయ నటి. అంతేకాదు, లాపతా లేడీస్ చిత్రానికి గాను ఉత్తమ నటిగా గుర్తింపు పొందిన నటీమణి కూడా అయింది.సోషల్ మీడియాలోనూ నితాన్షికి విపరీతమైన ఆదరణ ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు అత్యధిక ఫాలోవర్లు ఉన్న యంగ్ బాలీవుడ్ నటిగా పేరుంది.
ఓ యువతీ, భారత గర్వంగా నిలిచింది
కేన్స్‌లో నితాన్షి ప్రదర్శించిన హుందాతనం, సీనియర్ నటీమణుల పట్ల గౌరవం ఆమెపై ఉన్న ఆశల్ని నిలబెట్టింది. తన వయసుకి మించి న mature గాను, classy గాను మెరిసిన నితాన్షి ఇప్పుడు భారత సినీ ప్రపంచానికి గర్వకారణంగా మారింది.
Read Also : ఓటీటీలోకి వచ్చేసిన ‘చౌర్య పాఠం’ థ్రిలర్ సినిమా