దక్షిణ భారత సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్లలో అగ్రస్థానంలో నిలిచిన నయనతారకు (Nayanathara) భర్త విఘ్నేశ్ శివ ఈ ఏడాది కూడా బర్త్‌డే సందర్భంగా ప్రత్యేక గిఫ్ట్‌తో సర్ప్రైజ్ ఇచ్చారు. నవంబర్ 18 న నయనతార పుట్టినరోజు సందర్భంగా విఘ్నేశ్, తన సంప్రదాయాన్ని కొనసాగిస్తూ, మరోసారి లగ్జరీ కారును బహుమతిగా ఇచ్చారు.
Read Also: Rajamouli: రాజమౌళిపై పెరుగుతున్న ఫిర్యాదు

ప్రతి ఏడాది భార్యకు లగ్జరీ కార్లను గిఫ్ట్ చేసే విఘ్నేశ్ ఈసారి మరింత ఖరీదైన గిఫ్ట్‌తో ఆశ్చర్యపరిచారు. రోల్స్ రాయిస్ బ్లాక్ బ్యాడ్జ్ స్పెక్టర్ — ప్రపంచంలో అత్యంత ప్రీమియమ్ ఎలక్ట్రిక్ లగ్జరీ కార్లలో ఒకటైన ఈ స్పెక్టర్ విలువ భారత మార్కెట్‌లో సుమారు ₹10 కోట్లు.
ఈ కారు క్లాస్, స్టైల్, ప్రెస్టీజ్‌కు ప్రతీకగా భావిస్తారు. నయనతార(Nayanathara) పుట్టినరోజున ఈ కారును ఇంటికి తీసుకువచ్చి శుభాకాంక్షలు తెలిపిన విఘ్నేశ్ గిఫ్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. విఘ్నేశ్–నయన జంట లగ్జరీ కార్లకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో గత బర్త్‌డే గిఫ్ట్ చూసినా తెలుస్తుంది. 2024లో నయనతార పుట్టినరోజు సందర్భంగా విఘ్నేశ్ ఆమెకు ₹5 కోట్లు విలువైన మెర్సిడెస్ బెంజ్ మేబ్యాక్ జీఎల్‌ఎస్ 600ను బహుమతిగా ఇచ్చారు. అప్పటి నుండి ఈ గిఫ్ట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
నయన–విఘ్నేశ్ జంట ప్రేమ కథలా లగ్జరీ గిఫ్ట్‌ల కథ
విఘ్నేశ్ శివ నయనతారపై ఎంత ప్రేమ, ఆప్యాయత ఉంచుతారో ఆయన ఇస్తున్న ప్రత్యేక బర్త్‌డే గిఫ్ట్‌లు చూపిస్తున్నాయి. ప్రతి సంవత్సరం భార్య పుట్టినరోజున విలాసవంతమైన కారును గిఫ్ట్ చేయడం ఆయనకు సాంప్రదాయంలా మారిపోయింది. దంపతుల ఈ లగ్జరీ లైఫ్ స్టైల్ అభిమానుల్ని ఎప్పుడూ ఆకట్టుకుంటూనే ఉంది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read also :