ఎప్పుడూ షూటింగ్స్, ఈవెంట్స్‌తో బిజీగా ఉండే మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) ఈసారి కొంచెం విరామం తీసుకుంది. తన ప్రొఫెషనల్ కమిట్‌మెంట్స్ నుంచి గ్యాప్ తీసుకుని జపాన్ ట్రిప్‌కు వెళ్లింది.ఇచట వాహనములు నిలుపరాదు సినిమాతో టాలీవుడ్‌కి హాయ్ చెప్పిన మీనాక్షి, తర్వాత హిట్ 2, గుంటూరు కారం సినిమాలతో హిట్స్ సాధించింది. గతేడాది దుల్కర్ సల్మాన్‌తో నటించిన “లక్కీ భాస్కర్” మంచి వసూళ్లు సాధించింది. వరుసగా విజయాలు సాధించిన ఈ భామ, ఇప్పుడు వెకేషన్‌లో ఫుల్ ఎంజాయ్ చేస్తోంది.జపాన్ టూర్ (Japan Tour) లో మీనాక్షి స్టైలిష్ లుక్‌తో ఆకట్టుకుంది. వర్షం పడుతుంటే గొడుగు పట్టుకొని వీధుల్లో నడుస్తూ మాన్‌సూన్ అందాలను ఆస్వాదించింది. చెవిపోగులు, సింపుల్ పోనీటైల్ జుట్టు, అందమైన చిరునవ్వుతో ఆమె ఫొటోలు అందరినీ ఆకర్షిస్తున్నాయి.

ఫొటోలు వైరల్ అవుతున్నాయి
ప్రతి వీధిలో దిగిన ఫొటోలు ఆమె ట్రావెల్ డైరీలో ప్రత్యేకంగా నిలిచేలా ఉన్నాయి. కెమెరాకు ఇచ్చిన స్టన్నింగ్ పోజులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అభిమానులు ఈ ఫొటోలపై కామెంట్స్‌తో ముంచెత్తుతున్నారు.తన జపాన్ ట్రిప్‌పై మీనాక్షి ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ క్యాప్షన్ పెట్టింది. “కొన్ని యాదృచ్ఛిక సంఘటనలు జీవితంలో శాశ్వత ముద్ర వేస్తాయి. ఈ అద్భుతమైన రోజును జ్ఞాపకంగా సొంతం చేసుకున్నందుకు ఆనందంగా ఉంది. ఒక అందమైన కేఫ్‌లో గడిపిన సమయం, వర్ష దృశ్యాలు, జపనీస్ టీ – అన్నీ మరపురానివి” అంటూ షేర్ చేసింది.
కెరీర్ అప్‌డేట్స్
ఈ ఏడాది సంక్రాంతి బ్లాక్‌బస్టర్ “వస్తున్నాం”తో మీనాక్షి చౌదరి మళ్లీ హిట్ కొట్టింది. ప్రస్తుతం ఆమె “అనగనగా ఒక రాజు” సినిమాలో నటిస్తోంది. వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నా, వెకేషన్‌లో రిలాక్స్ కావడాన్ని మర్చిపోలేదు.తన జపాన్ వెకేషన్ ఫొటోలతో మీనాక్షి అభిమానులకు పాజిటివ్ వైబ్ పంచింది. పని ఎంత బిజీగా ఉన్నా కొన్నిసార్లు బ్రేక్ అవసరమని చెప్పినట్టే ఉంది.
Read Also :