Ivana : త్వరలో తెలుగు సినిమాలు చేసే ఛాన్స్ ఇవాన వెండితెరపై బాలనటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో ఎంతో కొద్ది మంది మాత్రమే హీరోయిన్లుగా స్థిరపడ్డారు.అలాంటి వారిలో శ్రీదేవి, మీనా, రాశి లాంటి నటీమణులు ముందుంటారు.బాలనటిగా కొన్ని సినిమాల్లో మెరిసి, ఇప్పుడు కథానాయికగా తనదైన శైలిలో ప్రేక్షకులను అలరిస్తున్న వ్యక్తి ఇవాన. ఆకర్షణీయమైన కళ్లతో తన ప్రత్యేకమైన అభినయంతో యువతను ఉర్రూతలూగిస్తోంది.’లవ్ టుడే’ సినిమా తరువాత ఆమె క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. ఈ సినిమా తెలుగులోనూ భారీ వసూళ్లు రాబట్టింది.దీంతో టాలీవుడ్‌లోనూ వరుస అవకాశాలు అందిపుచ్చుకుంటుందనుకున్నారు.దిల్ రాజు బ్యానర్‌లో ఓ అవకాశం దక్కించుకున్నా ఎక్కడో ఓ తేడా వచ్చి ఆ ప్రాజెక్ట్ కొనసాగలేదు. దీంతో తెలుగు ప్రేక్షకులను మరింత ఆకట్టుకునే చాన్స్ కోసం ఇవాన వేచి చూస్తోంది.

నితిన్ రామ్ వంటి యంగ్ హీరోల సరసన నటించే అవకాశాల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తుందనే టాక్ వినిపిస్తోంది.సాధారణంగా తమిళ సినిమాల్లో గుర్తింపు పొందిన హీరోయిన్లు, గ్యాప్ లేకుండా తెలుగు సినిమాల్లో అడుగుపెడుతుంటారు. కానీ ఇవాన విషయంలో అలా జరగలేదు. దీంతో ఈ అమ్మాయిని ప్రేక్షకులు మరిచిపోయారా అనే అనుమానాలు మొదలయ్యాయి.అయితే ఇటీవలి ‘డ్రాగన్’ సినిమాలో ఇవాన తెరపై మెరుస్తూ, కుర్రాళ్లను మరోసారి ఆకర్షించింది. ఈ సినిమాలో ఆమె గ్లామర్, పెర్ఫార్మెన్స్ చూసి యూత్ మళ్లీ ఫిదా అయ్యారు. దీంతో, ఈ బ్యూటీకి ఇక్కడ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని స్పష్టమైంది. మరి, ఇవాన ప్రయత్నాలు ఫలించి టాలీవుడ్‌లో సుదీర్ఘంగా తన జాడను ముద్రించుకుంటుందా అనేది వేచి చూడాలి.