ఎవరూ ఊహించని విధంగా టీవీ సెలబ్రిటీగా వెలుగొందిన నటి ఓదార్చలేని జీవితం నుంచి విముక్తి కోసం ఆధ్యాత్మికత వైపు అడుగుపెట్టింది. ఈమె ఎవరో కాదు – నూపూర్ అలంకార్ (Nupur Alankar).నూపూర్ అలంకార్ పేరుని విని గుర్తుపట్టకపోవచ్చు. కానీ ఆమె “శక్తిమాన్” సీరియల్‌లో నటించిన పాత్ర మాత్రం ప్రేక్షకులు మరచిపోలేరు. అలాగే “ఘర్ కి లక్ష్మీ బేటియా”, “తంత్ర” వంటి పాపులర్ టీవీ సీరియల్స్‌లో ఆమె చూపిన నటనకు మంచి గుర్తింపు లభించింది.2022లో నూపూర్ ఒక్కసారిగా పరిశ్రమకు గుడ్‌బై చెప్పి ఆధ్యాత్మిక (Spiritual) మార్గాన్ని ఎంచుకున్నారు. అప్పట్నుంచి గుహలు, పర్వతాలు, అడవుల్లో తపస్సు చేస్తూ జీవిస్తున్నారు. ఆమె జీవనశైలి పూర్తిగా మారిపోయింది.”నాకు నా గత జీవితంలో ఏమీ కొరత లేదు. కానీ లోపల ఎక్కడో ఓ శూన్యం అనిపించేది. అదే నన్ను ఈ మార్గంలో నడిపించింది,” అని చెప్పారు.

ఇప్పుడు నా మనస్సు పూర్తిగా శాంతంగా ఉంది
చాలామంది నాకు సమాధానాలు దొరకక అలా పరారయ్యిందనుకున్నారు. కానీ నిజానికి నేను దేవునికి నా జీవితం అంకితం చేశాను. ఇప్పుడు నా మనస్సు చాలా తేలికగా ఉంది. భీకరమైన చలిలో కూడా నేనెక్కడో గుహలో ధ్యానం చేశాను,” అంటూ చెప్పుకొచ్చారు.పూర్వం నా బిల్లులకు లక్షలు ఖర్చయ్యేవి. ఇప్పుడు మాత్రం పది నుంచి ఇరవై వేలు చాలు. భిక్షాటన చేస్తాను, అందులో కొంత భాగాన్ని దేవుడికి సమర్పిస్తాను. నా దగ్గర ఐదు జతల బట్టలు మాత్రమే ఉన్నాయి, అని అన్నారు.నూపూర్ ప్రస్తుతం దేవాలయాల వద్ద భిక్షాటన చేస్తూ కనిపిస్తున్నారు. ఆమె ఫోటోలు, వీడియోలు నిత్యం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అభిమానులు ఆమె మార్పును ఆశ్చర్యంగా చూస్తున్నారు.
ప్రజలకు ఆధ్యాత్మిక మార్గనిర్దేశకురాలిగా మారింది
నూపూర్ ఇప్పుడు సేవకురాలిగా మారారు. ఇప్పుడు నేను ప్రజలకు ఆధ్యాత్మికత గురించి చెబుతాను. నా పాత్ర మారింది, కానీ జీవన పరమార్ధం మాత్రం తెలిసింది, అని చెప్పారు.నూపూర్ జీవిత మార్పు ఎంతో మందికి స్పూర్తిగా మారుతుంది. స్టార్‌గా వెలిగిన ఆమె ఇప్పుడు ఆధ్యాత్మిక మార్గంలో నిలదొక్కుకున్నారు. ఆమె నిర్ణయం ఎన్నో జీవితాలకు మార్గం చూపే ఆశగా నిలుస్తోంది.
Read Also : Doctor crime : అత్తను చంపి 19 ముక్కలుగా చేసిన డాక్టర్ అల్లుడు