సాయి పల్లవి (Sai Pallavi)ని ఇష్టపడని ప్రేక్షకులు ఉండరని చెప్పాలి. ఈ ముద్దుగుమ్మను చాలామంది ఈ తరం సౌందర్య అని పిలుస్తుంటారు. ఎలాంటి స్కిన్ షో చేయకుండా, కేవలం తన సహజమైన నటనతోనే అపారమైన అభిమానులను సంపాదించుకుంది. ఆమె సినిమాల కోసం అభిమానులు ఎప్పుడూ ఆతృతగా ఎదురుచూస్తూ ఉంటారు.నేచురల్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న సాయి పల్లవి, చేసిన సినిమాలు తక్కువైనా క్రేజ్ మాత్రం ఎక్కువే. స్టార్ హీరోలతో సమానంగా ఆమెకు అభిమాన వర్గం ఉంది. తెలుగులో అభిమానులు ఆమెను లేడీ పవర్ స్టార్ అని ముద్దుగా పిలుస్తారు.

ప్రేమమ్ నుంచి ఫిదా వరకు ప్రయాణం
సాయి పల్లవి తొలి సినిమా ప్రేమమ్ మలయాళంలోనే ఆమెకు ఊహించని గుర్తింపును తెచ్చింది. ఆ తర్వాత ఫిదాతో తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చింది. ఒక్క సినిమాతోనే ఆమె తెలుగులో స్టార్ స్థాయికి చేరుకుంది. తమిళం, మలయాళం, తెలుగు – మూడు భాషల్లోనూ వరుస ఆఫర్లు అందుకుంటూ, తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకుంది.ఇటీవల విడుదలైన తండేల్ సినిమాలో అక్కినేని నాగచైతన్య సరసన నటించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి భారీ హిట్‌గా నిలిచింది. ఈ విజయంతో సాయి పల్లవి మరోసారి తన రేంజ్ ఏంటో చూపించింది.ప్రస్తుతం సాయి పల్లవి బాలీవుడ్‌లో అడుగుపెడుతోంది. రామాయణం సినిమాలో సీత పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రంలో రాముడిగా రణబీర్ కపూర్ కనిపించనున్నారు. ఒక పౌరాణిక పాత్రలో నటించడం ఆమె కెరీర్‌లో మైలురాయిగా మారబోతోంది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు
ఇదిలా ఉండగా, తాజాగా సాయి పల్లవికి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సాధారణంగా గ్లామర్ రోల్స్‌కు దూరంగా ఉండే సాయి పల్లవి, అప్పుడప్పుడు సోషల్ మీడియాలో తన సహజమైన ఫోటోలను పంచుకుంటుంది. కానీ తాజాగా బికినీ ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతుండడంతో అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఎప్పుడూ సింపుల్‌గా కనిపించే ఆమె ఇప్పుడు బికినీలో కనిపించడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.ఈ ఫోటోలు నిజమా లేదా ఏఐ (AI) తో సృష్టించబడినవా అన్న అనుమానాలు పెరుగుతున్నాయి. కొందరు నెటిజన్లు ఇవి నిజమని చెబుతుండగా, మరికొందరు మాత్రం ఇవి కేవలం మోసపూరితమైనవని అంటున్నారు. అయితే నిజం ఏదైనా, ఈ ఫోటోలు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీశాయి.ప్రస్తుతం ఈ ఫోటోలు కారణంగా మరో వివాదం మొదలైంది. సాయి పల్లవి రామాయణం సినిమాలో నటిస్తున్నందున, బికినీ ఫోటోల వల్ల ఆమెను సినిమాతో తొలగించాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా సోషల్ మీడియాలో #BoycottSaiPallavi అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది.
అభిమానుల మద్దతు, సాయి పల్లవి స్పందన ఏంటి?
ఒకవైపు విమర్శలు వస్తున్నా, మరోవైపు అభిమానులు మాత్రం సాయి పల్లవికి మద్దతు ఇస్తున్నారు. ఆమె ఎప్పుడూ నేచురల్‌గా నటిస్తూ, ఎలాంటి గ్లామర్ రోల్స్‌కు దూరంగా ఉంటుందని వారు చెబుతున్నారు. ఈ వివాదంపై సాయి పల్లవి ఇంకా స్పందించలేదు. అభిమానులు ఆమె మాట కోసం ఎదురుచూస్తున్నారు.
Read Also :