Anushka Shetty: టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్ అంటే అందరికీ గుర్తొచ్చే పేరు అనుష్క శెట్టి. (Anushka Shetty) 2005లో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన సూపర్ సినిమాతో తెరంగేట్రం చేసిన అనుష్క, తర్వలోనే విక్రమార్కుడు చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తరువాత ఆమె కెరీర్‌లో పెద్ద మలుపు తీసుకొచ్చిన సినిమా అరుంధతి (Arundhati) (2009). ఇందులో ఆమె డ్యూయల్ రోల్‌లో నటించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రానికి ఆమెకు నంది అవార్డు, ఫిల్మ్‌ఫేర్ అవార్డు లభించాయి. ఆ తరువాత బాహుబలి సిరీస్‌లో దేవసేన పాత్రతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. రుద్రమదేవి, సైజ్ జీరో, భాగమతి వంటి చిత్రాలు ఆమె ప్రతిభను మరింతగా చూపించాయి.
Read also: Nara Rohit: నారా రోహిత్ పెళ్లి వేడుకలు షురూ..

Anushka Shetty: అనుష్కకు మొదటి లవ్ ప్రపోజల్ ఎప్పుడొచ్చిందో తెలుసా.?
Anushka Shetty: అనుష్క సినిమా రంగంలోకి రాకముందు యోగా టీచర్‌గా పనిచేసేది. ఆమె ప్రముఖ యోగా గురువు భరత్ ఠాకూర్ వద్ద శిక్షణ పొందింది. ప్రస్తుతం 40 ఏళ్లు దాటినా కూడా ఆమె పెళ్లి చేసుకోలేదు. వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వార్తలు తరచూ చర్చనీయాంశమవుతుంటాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అనుష్క తన మొదటి లవ్ ప్రపోజల్ గురించి ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. “నేను ఆరో తరగతిలో ఉన్నప్పుడు ఒక అబ్బాయి వచ్చి నాకు ‘ఐ లవ్ యూ’ అన్నాడు. అప్పుడు నాకు ఆ పదానికి అర్థమే తెలియదు. కానీ అతను చెప్పగానే ‘ఓకే’ అని చెప్పేశా. అది నా జీవితంలో ఓ మధురమైన జ్ఞాపకంగా మిగిలిపోయింది,” అని ఆమె నవ్వుతూ చెప్పింది.

అనుష్క శెట్టి సినిమా రంగంలోకి ఎలా వచ్చారు?
అనుష్క శెట్టి 2005లో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన సూపర్ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది.
ఆమె కెరీర్‌లో టర్నింగ్ పాయింట్‌గా నిలిచిన సినిమా ఏది?
2009లో వచ్చిన అరుంధతి చిత్రం అనుష్క కెరీర్‌లో మలుపు తీసుకొచ్చింది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: