2000లో విడుదలైన బద్రి సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన (Opposite Pawan Kalyan in the movie Badri) నటించి అమీషా పటేల్ (Ameesha Patel) తెలుగు ప్రేక్షకుల మనసును దోచుకుంది. “ఏ.. చికితా.. గుమస్తాస్” పాటలో ఆమె అందం, అందమైన స్క్రీన్ ప్రెజెన్స్ కుర్రాళ్ల గుండెల్లో చెరగని ముద్ర వేసింది. బద్రి విజయం తరువాత ఆమె నాని, నరసింహుడు, పరమవీరచక్ర వంటి సినిమాల్లో నటించింది. అయితే అవి ఆ స్థాయి విజయాన్ని ఇవ్వలేకపోయాయి. దీంతో అమీషా బాలీవుడ్ వైపు మొగ్గు చూపి అక్కడే కెరీర్‌ను కొనసాగించింది.అమీషా పటేల్ నటనతో పాటు వివాదాలతో కూడా వార్తల్లో నిలిచింది. ఆమెపై కేసులు, కోర్టు సమస్యలు తరచుగా హెడ్లైన్లలో నిలిచాయి. సినిమాల కంటే ఈ వివాదాలే ఎక్కువగా పాపులారిటీని తెచ్చిపెట్టాయి.

గదర్ 2తో మరోసారి పునరాగమనం
ఎక్కువ గ్యాప్ తరువాత అమీషా రెండు సంవత్సరాల క్రితం గదర్ 2 సినిమా ద్వారా మళ్లీ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డు విజయాన్ని సాధించడంతో అమీషా కెరీర్ మళ్లీ జోరు అందుకుంది. దీంతో వరుసగా కొత్త సినిమాలు లైన్లోకి వచ్చాయి.సినిమాలతో పాటు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉండే అమీషా తరచుగా తన ఫోటోలను అభిమానులతో పంచుకుంటుంది. ఆమె పోస్ట్ చేసే హాట్ ఫోటోలు ఎప్పుడూ వైరల్ అవుతుంటాయి. యంగ్ హీరోయిన్లకు ఏమాత్రం తగ్గని గ్లామర్ షో చేస్తూ అభిమానులను అలరిస్తుంది.
పెళ్లి కాకుండా 50 ఏళ్ల అమీషా
ప్రస్తుతం 50 ఏళ్లు వచ్చినా అమీషా ఇంకా పెళ్లి చేసుకోలేదు. కానీ ఆమె స్టైల్, అందం మాత్రం ఏమాత్రం తగ్గలేదు. నిత్యం కొత్త లుక్స్‌లో కనిపిస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది.తాజాగా అమీషా బ్లాక్ కలర్ స్లీవ్‌లెస్ డిజైనర్ డ్రెస్‌లో ఫొటోషూట్ చేసింది. ఈ ఫోటోల్లో ఆమె క్లివేజ్ షో చేస్తూ కుర్రాళ్ల గుండెల్లో హీట్ పెంచింది. ఈ చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
నెటిజన్ల మిశ్రమ స్పందన
ఈ ఫోటోలను చూసి కొంతమంది నెటిజన్లు ఆశ్చర్యపోతూ కామెంట్లు చేస్తున్నారు. అమీషా ఏంటి ఇలా మారిపోయింది? ముఖంలో మునుపటి కాంతి కనిపించడం లేదు” అని కొందరు అన్నారు. ఇంకొందరు “ముడతలు ఎక్కువైపోయాయి అని విమర్శించారు. అయితే మరికొందరు మాత్రం “అద్భుతంగా ఉంది”, “ఇంకా అందమే” అంటూ ప్రశంసలు కురిపించారు. మొత్తంగా చెప్పాలంటే, బద్రి భామ అమీషా పటేల్ ఇప్పుడు కూడా తన గ్లామర్‌తో అభిమానులను అలరిస్తూనే ఉంది. వయసు కేవలం సంఖ్య మాత్రమేనని మరోసారి నిరూపిస్తోంది.
Read Also :