Rajinikanth: తమిళనాడులో బాంబు బెదిరింపులు మళ్లీ హడలెత్తిస్తున్నాయి. ఈసారి టార్గెట్‌గా మారిన వారు సూపర్‌స్టార్ రజనీకాంత్, (Rajinikanth) నటుడు ధనుష్. చెన్నై డీజీపీ కార్యాలయానికి ఒక గుర్తు తెలియని వ్యక్తి నుంచి వచ్చిన ఈమెయిల్‌లో, రజనీకాంత్, ధనుష్ ఇళ్లతో పాటు కాంగ్రెస్ నేత సెల్వపెరుతంగై నివాసాన్ని పేల్చేస్తామంటూ బెదిరింపులు చేశారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌లను రంగంలోకి దించి సంబంధిత ప్రాంతాల్లో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. చెన్నైలోని పొయెస్ గార్డెన్, కీల్పాక్ ప్రాంతాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.
Read also: Nara Rohit: నారా రోహిత్ పెళ్లి వేడుకలు షురూ..

Rajinikanth: ఇది తమిళనాడులో బాంబు బెదిరింపుల పరంపరలో తాజా ఘటనగా నిలిచింది. ఇంతకుముందు కూడా సీఎం స్టాలిన్, నటి త్రిష, రజనీకాంత్ ఇళ్లకు ఇలాంటి బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో పోలీసులు ఈమెయిల్ పంపిన వ్యక్తిని గుర్తించే దిశగా దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ ఘటనల వెనుక ఒకే ముఠా ఉన్నదా లేదా వేర్వేరు వ్యక్తులు పాల్పడుతున్నారా అనే కోణంలో విచారణ కొనసాగుతోంది. మొత్తం రాష్ట్రంలో భద్రతా చర్యలను మరింత పెంచినట్టు సమాచారం.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: