हिन्दी | Epaper
భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్ భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్ భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్ భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్

22 ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తున్న హీరోయిన్..

Divya Vani M
22 ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తున్న హీరోయిన్..

ఇటీవల టాలీవుడ్‌లో ఓ పాత హీరోయిన్ రీఎంట్రీకి సిద్ధమవుతోంది. దాదాపు 22 ఏళ్ల క్రితం సినీ ఇండస్ట్రీలో తన తొలి సినిమాతోనే అందరిని ఆకట్టుకున్న అన్షు అంబానీ మళ్లీ వెండితెరపై కనిపించేందుకు రెడీ అవుతోంది. తొలి సినిమా నుంచే తన అందం, అభినయంతో కుర్రకారుని అభిమానులను ఆకట్టుకున్న అన్షు, తెలుగు సినిమాల్లో కేవలం మూడు సినిమాల్లో నటించినప్పటికీ స్టార్ హీరోయిన్ స్థాయిలో ఫాలోయింగ్ సంపాదించుకుంది.అన్నీ బాగా నడుస్తున్న సమయంలోనే అన్షు సినిమాలకు బ్రేక్ ఇచ్చి ఇండస్ట్రీకి దూరమైంది. తర్వాత పెళ్లి చేసుకుని కుటుంబంతో బిజీ అయ్యింది.

mazaka movie
mazaka movie

ఇప్పుడు ఎంతోకాలం తర్వాత మళ్లీ సినిమాల్లోకి అడుగుపెడుతోంది. ఇటీవల అన్షు ఫస్ట్ లుక్ పోస్టర్‌తో పాటు టీజర్ కూడా విడుదలైంది. అన్షు నటిస్తున్న తాజా సినిమా ‘మజాకా’, ఇందులో యంగ్ హీరో సందీప్ కిషన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని త్రినాథ రావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నారు.’మజాకా‘ సినిమాలో అన్షు అంబానీ కొత్తగా పెళ్లికూతురు గెటప్‌లో కనిపించబోతున్నారు. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌లో ఆమె చేతిలో తాళి, కొబ్బరిబొండం పట్టుకుని కనిపించడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. ఈ చిత్రంలో సందీప్ కిషన్‌తో పాటు రీతూ వర్మ, రావు రమేశ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

Ashu
Ashu

సమాచారం మేరకు అన్షు అంబానీ రావు రమేశ్‌కు జోడీగా నటించనున్నారు.అన్షు నటనకు, పాత్రకు సంబంధించిన టీజర్ ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. గతంలో అక్కినేని నాగార్జున సరసన ‘మన్మథుడు’ సినిమాలో ఫ్లాష్‌బ్యాక్ పాత్రలో కనిపించి యువతను ఆకట్టుకున్న అన్షు, ప్రభాస్ హీరోగా నటించిన ‘రాఘవేంద్ర’ సినిమాలో కథానాయికగా నటించింది. ఈ రెండు చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అన్షు, తర్వాత ఇండస్ట్రీకి దూరమైంది. ఇప్పుడు మళ్లీ రీఎంట్రీ ఇస్తుండటంతో ఆమె అభిమానులు ఎంతో ఆనందంగా ఉన్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870