हिन्दी | Epaper
భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్ భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్ భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్ భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్

20 ఏళ్లుగా సినిమాలు చేస్తున్నా నో క్రేజ్..

Divya Vani M
20 ఏళ్లుగా సినిమాలు చేస్తున్నా నో క్రేజ్..

చెన్నైకు చెందిన ఈ అందాల తార దాదాపు 20 సంవత్సరాలుగా సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతోంది. స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంటూ, పలు భాషల్లో తన ప్రతిభను ప్రదర్శించింది. అయితే,ఎన్నో హిట్ చిత్రాల్లో నటించినప్పటికీ, ఈ ముద్దుగుమ్మ ఇప్పటివరకు స్టార్ హీరోయిన్ స్థాయి దక్కించుకోలేకపోయింది.పై ఫోటోలో తెల్ల గౌను ధరించి ఏంజెల్‌లా మెరిసిపోతున్న ఈ నటి ఇప్పుడు దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో క్రేజ్‌ సొంతం చేసుకున్న అందాల భామ.2005లో చిత్రసీమలో అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ సుమారు 40కు పైగా చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. తెలుగుతో పాటు తమిళ్, హిందీ భాషల్లోనూ మెరిసింది.

పలు సూపర్‌హిట్ చిత్రాల్లో నటించినప్పటికీ, ఈ తారకు స్టార్ హీరోయిన్ స్థాయి మాత్రం అందని ద్రాక్షగా మారింది.ప్రస్తుతం ఈ నటి సినిమాల సంఖ్యను తగ్గించి, పాత్రలకు ప్రాధాన్యత ఉన్న చిత్రాలను మాత్రమే ఎంచుకుంటోంది.ఇటీవల ఎక్కువగా సస్పెన్స్, థ్రిల్లర్, హారర్ జానర్స్‌లో మహిళా ప్రాధాన్యమైన పాత్రలు చేస్తోంది. ఆ మేరకు కొన్ని చిత్రాల్లో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు కూడా పోషించి ప్రేక్షకులను మెప్పిస్తోంది. ఆమె ప్రతిభను ప్రశంసించాల్సిందే,ఎందుకంటే తక్కువ అవకాశాలతోనే తన ప్రత్యేకతను నిరూపించుకుంది.ఈ అందాల తార ఎవరో తెలుసా? ఆమె మరెవరో కాదు, రెజీనా కాసాండ్రా. తెలుగులో ఆమె నటించిన పలు సూపర్‌హిట్ చిత్రాలు ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి.రెజీనా అందం, అభినయం అన్నీ కలగలిపిన అద్భుత నటి. గురువారం (డిసెంబర్ 13) ఆమె పుట్టిన రోజు సందర్భంగా, ఆమె అభిమానులు, సినీ ప్రముఖులు, నెటిజన్లు రెజీనాకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సినిమా కెరీర్‌ను కొత్త దిశగా తీసుకెళ్లే ప్రయత్నంలో ఉన్న ఈ నటి భవిష్యత్తులో మరిన్ని అద్భుత పాత్రలతో ప్రేక్షకులను మెప్పిస్తారని ఆశిద్దాం.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870