బాలీవుడ్ గ్లామర్ తార మలైకా అరోరా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫిట్‌నెస్ క్వీన్‌గా, ఫ్యాషన్ ఐకాన్‌గా గుర్తింపు పొందిన ఈ నటి తన వ్యక్తిగత జీవితం, ప్రేమ వ్యవహారాలతో తరచుగా వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఇటీవలి కాలంలో, ఆమె జీవనశైలి, ప్రత్యేక సంబంధాలు మరోసారి బలమైన చర్చకు దారితీశాయి. అర్జున్ కపూర్‌తో విడిపోయిన తరువాత, మలైకా ప్రస్తుతం ఒక ‘మిస్టరీ మ్యాన్’తో ఎక్కువగా కనిపిస్తూ సంచలనంగా మారింది.మలైకా ఇటీవలే ఒక ప్రైవేట్ రెస్టారెంట్ బయటకు వస్తున్నప్పుడు ఈ మిస్టరీ మ్యాన్‌తో చేతులు పట్టుకుని కనిపించింది. కొద్ది రోజుల తరువాత, ఆమె ప్రముఖ సింగర్ ఏ.పి. ధిల్లాన్ సంగీత కచేరికి హాజరై మళ్లీ అదే వ్యక్తితో కనిపించింది.
అక్కడ ఆమెను వేదికపైకి ఆహ్వానించగా,ప్రత్యేకంగా ఆమె కోసం పాట పాడి అభిమానులను ఆశ్చర్యపరిచాడు.అంతేకాదు,మలైకా తన చిన్ననాటి క్రష్ అని ధిల్లన్ బహిరంగంగా చెప్పిన సంగతి అక్కడ ఉన్నవారిని మరింత అలరించింది. వేదికపై ఒకరినొకరు కౌగిలించుకున్న ఈ జంట ఆ తర్వాత దిగిన సెల్ఫీని మలైకా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో, ఈ ఫోటోలు వైరల్‌గా మారాయి. ఈ వ్యక్తి ఎవరో తెలిసి, బాలీవుడ్ మీడియాలో ఊహాగానాలకు తెరతీశారు. ఈ మిస్టరీ మ్యాన్ పేరు రాహుల్ విజయ్ అని వార్తలు వచ్చాయి, అయితే దీనిపై మలైకా ఇప్పటివరకు స్పందించలేదు.మలైకా మరియు అర్జున్ కపూర్ మధ్య విడిపోవడం బాలీవుడ్‌లో ప్రధానమైన చర్చనీయాంశంగా మారింది. గత కొద్ది రోజుల్లో అర్జున్ తన ప్రమోషనల్ ఈవెంట్లలో తాను ఒంటరిగా ఉన్నానని పేర్కొన్నాడు. అయితే, వీరి మధ్య దూరం ఏర్పడడానికి గల అసలు కారణాలు ఇప్పటికీ మిస్టరీగానే ఉన్నాయి.
మరోవైపు, మలైకా తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా హాస్యాత్మక పోస్ట్‌లు షేర్ చేస్తూ అభిమానులకు ఆలోచనలో పడేసింది. మలైకా అరోరా మరియు అర్జున్ కపూర్ 2018లో డేటింగ్ ప్రారంభించారు. అర్బాజ్ ఖాన్‌తో విడాకులు తీసుకున్న తరువాత, ఈ ఇద్దరూ తమ ప్రేమకు రెండో అవకాశం ఇచ్చారు. 2019లో వారు తమ సంబంధాన్ని బహిరంగంగా ప్రకటించడంతో భారీగా చర్చకు దారితీశారు.
వారి మధ్య వయస్సు తేడా ఉండటంతో నెటిజన్లు వారిని ట్రోల్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.అయితే, వీరు ట్రోలింగ్‌కు భయపడకుండా తమ బంధాన్ని ముందుకు తీసుకెళ్లారు.సెప్టెంబర్‌లో మలైకా తండ్రి ఆత్మహత్య చేసుకోవడం ఆమె కుటుంబాన్ని తీవ్రంగా కలచివేసింది. ఆ సమయంలో అర్జున్ ఆమెకు మద్దతుగా నిలబడ్డాడు. ఇదే సమయంలో, వారి బంధం మరింత పటిష్ఠమవుతుందని భావించిన అభిమానులకు, బ్రేకప్ వార్తలు నిరాశను మిగిల్చాయి. మలైకా తాజా వార్తలపై అభిమానులు ఆతృతగా ఉండగా, ఆమె తదుపరి వ్యక్తిగత నిర్ణయాలు మరియు ప్రొఫెషనల్ ప్రాజెక్టులు ఎలాంటి మలుపులు తీసుకుంటాయో వేచి చూడాల్సిందే.