हिन्दी | Epaper
భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్ భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్ భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్ భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్

ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అక్కడైనా కియారా కనిపిస్తుందా ?

Divya Vani M
ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అక్కడైనా కియారా కనిపిస్తుందా ?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తాజా సినిమా గేమ్ ఛేంజర్ ప్రేక్షకులను ఎంతో ఉత్కంఠతో వేచి వేళ.ఈ చిత్రానికి డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. జనవరి 10న సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం, రాజమండ్రి లో ఈ రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు.గేమ్ ఛేంజర్ సినిమాపై పెద్ద అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదలవ్వబోతోంది, మరియు దిల్ రాజు ఈ సినిమాని అత్యధిక బడ్జెట్‌తో నిర్మించారు.

Actress Kiara Advani Game Changer
Actress Kiara Advani Game Changer

రామ్ చరణ్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తుండగా, కియారా అద్వానీ కథానాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో అంజలి, శ్రీకాంత్, ఎస్ జే సూర్య వంటి ప్రముఖులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా జనవరి 10న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల అవుతోంది. ఈ నేపథ్యంలో, ఈ సినిమా ప్రమోషన్లను మేకర్స్ జోరుగా నిర్వహిస్తున్నారు. రాజమండ్రి లో జరగనున్న ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా రానున్నారు. కానీ, బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ గేమ్ ఛేంజర్ ప్రమోషన్లకు దూరంగా ఉంటుందని సమాచారం. ఆమె వరుసగా సినిమాలు చేస్తుండటంతో ఆస్వస్థత కు గురైనట్లు తెలుస్తోంది.

కియారా, లక్నోలో జరిగిన టీజర్ లాంచ్ ఈవెంట్‌లో మాత్రమే పాల్గొన్నారు. అయితే, రాజమండ్రి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆమె పాల్గొంటారో లేదో అన్నది స్పష్టంగా చెప్పబడలేదు. ఇంకా, కియారా ఆరోగ్యం గురించి వైరల్ అవుతున్న వార్తలపై ఆమె పర్సనల్ టీమ్ క్లారిటీ ఇచ్చింది. కియారా ఆరోగ్యం సరిగ్గా ఉందని, ఆసుపత్రిలో చేరిన విషయములో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు.రామ్ చరణ్ గతంలో ట్రిపుల్ ఆర్ చిత్రంలో నటించిన తర్వాత, ఈ సినిమాతో సోలోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870