పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ అయిన అలియా భట్ పేరు ఇప్పుడు మరోసారి టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. తన తొలి తెలుగు సినిమా ఆర్ఆర్ఆర్ తోనే తెలుగు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన ఈ అందాల తార, ఇప్పుడు తన రెమ్యునరేషన్‌తో అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అలియా భట్ బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ మహేష్ భట్ కుమార్తెగా సినీ రంగంలో అడుగుపెట్టింది. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాతో కెరీర్ ప్రారంభించిన అలియా మొదటి సినిమాతోనే సూపర్ హిట్ సాధించింది. తన అందం, అభినయం, వైవిధ్యమైన పాత్రల ఎంపికతో బాలీవుడ్‌లో తక్కువ సమయంలోనే స్టార్ డమ్ అందుకుంది. అయితే తెలుగు ప్రేక్షకులకు అలియా ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎందుకంటే డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ ఆర్ఆర్ఆర్ లో సీత పాత్రలో అలియా అద్భుతంగా మెరిసింది.తెలుగులో ఇప్పటివరకు ఒక్కటే సినిమా చేసినప్పటికీ, అలియా భట్ ఆ ఒక్క సినిమాతోనే ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసింది.
ఆర్ఆర్ఆర్ కోసం ఆమె సుమారు పది రోజుల షూటింగ్‌లో పాల్గొంది.కానీ ఆ కొద్దిరోజులే కాకుండా, తన రెమ్యునరేషన్ విషయంలో మామూలు హవా చూపించలేదు.సమాచారం ప్రకారం,ఆ పది రోజుల షూటింగ్ కోసం ఏకంగా రూ.9 కోట్లు తీసుకుందట! ఇది తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా మందిని ఆశ్చర్యపరచింది.అలియాకు బాలీవుడ్‌లో ఉన్న ప్రత్యేక గుర్తింపు, అంతర్జాతీయ స్థాయిలో సౌత్ ఇండియన్ సినిమాలకు ఉన్న క్రేజ్ కలిసొచ్చాయి. ఆమె పేరు మాత్రమే సినిమాకు అదనపు హైప్‌ను తీసుకురాగలదు.పైగా, జాతీయ అవార్డుల దాకా దూసుకెళ్లిన ఆమె నటన, తెలుగులో చేసిన తొలి సినిమాలోనే తనకు ఉన్నటువంటి టాలెంట్‌ను ప్రదర్శించింది. రాజమౌళి వంటి లెజెండరీ దర్శకుడి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం అలియాకు టాలీవుడ్‌లో బిగ్ బ్రేక్ ఇచ్చింది. ఈ సినిమాలో ఆమె రామ్ చరణ్ సరసన నటించిన సీత పాత్ర తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది.