పెళ్లైతే గ్లామర్ షో ఆపాలా? అలాంటిదేమైనా రాజ్యాంగంలో రాసుందా?”అంటూ ప్రశ్నిస్తున్నారు మన సినీ తారలు. ఒకప్పుడు పెళ్లి అంటే నటీమణుల కెరీర్‌కు శుభం కార్డ్ అనుకునేవాళ్లు.కానీ కాలంతో పాటు అభిప్రాయాలు మారాయి. ఇప్పుడు పెళ్లైన హీరోయిన్లకే మరింత క్రేజ్ ఉంది.పెళ్లి తరువాత గ్లామర్ షోలో వీరు చూపిస్తున్న దూకుడు ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ ట్రెండ్‌లో ప్రముఖంగా నిలిచిన కొందరి కథలు చూద్దాం. ప్రస్తుతం కీర్తి సురేష్ పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.15 ఏళ్లుగా ప్రేమలో ఉన్న ఆంటోనీ తటిల్‌ను గోవాలో మూడు ముళ్లతో భార్యగా స్వీకరించారు. కానీ పెళ్లికి రెండు మూడు రోజుల ముందే ఆమె చేసిన గ్లామర్ ఫోటోషూట్ వైరల్ అయింది. పెళ్లి దగ్గర పడుతున్న సమయంలోనూ గ్లామర్ డోస్ పెంచి, బేబీ జాన్ వంటి ప్రాజెక్ట్‌లలో మరింత గ్లామరస్‌గా కనిపించారు.గత ఏడాది ప్రియుడు జాకీ భగ్నానీని పెళ్లాడిన రకుల్ కూడా తన గ్లామర్ గేమ్‌ను మరింత పెంచేశారు.
కొత్త ఫోటోషూట్స్ చేస్తూ ప్రతి సారి కొత్తగా అభిమానులను ఆశ్చర్యపరుస్తున్నారు. పెళ్లి తరువాత రకుల్ తన వన్-అఫ్-ద-మోస్ట్ గ్లామరస్ స్టార్లుగా ఎదిగారు.కియారా అద్వానీ తన ప్రేమికుడు సిద్ధార్థ్ మల్హోత్రాను వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత కూడా ఆమె గ్లామర్ ప్రదర్శనలో తగ్గేదే లే అని చెప్పే విధంగా కనిపిస్తున్నారు.లిప్ లాక్ సీన్స్ చేయడానికే కాకుండా గ్లామర్ ఫోటోషూట్స్‌లోనూ తన ప్రత్యేకతను చూపిస్తున్నారు.రణ్‌బీర్ కపూర్‌ను వివాహం చేసుకున్న ఆలియా భట్ కూడా ఈ ట్రెండ్‌లో భాగమవుతున్నారు.పెళ్లి తరువాత గ్లామర్ షో తగ్గించుకోవడం గురించి ఆలోచన చేయకుండా, సినిమాల్లో ఆహ్లాదకరమైన పాత్రల్లోనే కాకుండా స్టైలిష్ లుక్స్‌లోనూ మెరిసిపోతున్నారు.కత్రినా కైఫ్, దీపిక పదుకొనే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వీరిద్దరూ పెళ్లి తర్వాత కూడా గ్లామర్ షోలో ఎలాంటి బ్రేక్ తీసుకోలేదు. సినిమా కథకు అనుగుణంగా గ్లామర్ ప్రదర్శించడంలో ఎలాంటి సంకోచం లేదు.