అందాల రాక్షసి లావణ్యకు వరుస ఆఫర్స్ క్యూ లావణ్య త్రిపాఠి కెరీర్‌లో తొలి సినిమా ‘అందాల రాక్షసి’ పెద్ద విజయాన్ని అందించింది. ఈ సినిమా ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.తన అభినయంతో ప్రేక్షకుల మనసు గెలుచుకున్న లావణ్యకు అప్పటి నుంచి వరుస ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. ‘దూసుకెళ్తా, ‘భలే భలే మగాడివోయ్’, ‘సోగ్గాడే చిన్నినాయనా’, ‘శ్రీరస్తు శుభమస్తు’ వంటి హిట్ చిత్రాల్లో నటించి మంచి క్రేజ్ సంపాదించింది.అయితే ఈ సినిమాలన్నీ హిట్ అయినా ఆమె కెరీర్‌కు పెద్ద బ్రేక్ మాత్రం ఇవ్వలేదు.దీంతో లావణ్య కెరీర్ కొంత మందగమనం చెందింది. గత కొంత కాలంగా లావణ్య నుంచి పెద్దగా సినిమాలు రావడం లేదు.2023 నవంబర్ 1న మెగా హీరో వరుణ్ తేజ్‌ను వివాహం చేసుకున్న తర్వాత ఆమె సినిమాలకు విరామం ఇచ్చింది.

వరుణ్ తేజ్ లావణ్య కలిసి ‘మిస్టర్’, ‘అంతరిక్షం’ చిత్రాల్లో నటించారు.అయితే ఈ సినిమాలు అంతగా ఆకట్టుకోలేకపోయాయి.‘మిస్టర్’ సినిమా షూటింగ్ సమయంలో వరుణ్, లావణ్య మధ్య స్నేహం ఏర్పడింది.క్రమంగా అది ప్రేమగా మారింది.కానీ ఇద్దరూ ఈ విషయం సీక్రెట్‌గా ఉంచారు. చివరికి 2023లో పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించారు.ప్రస్తుతం లావణ్య సినిమాలకు దూరంగా ఉన్నా, సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటుంది. రెగ్యులర్‌గా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఆమె తిరిగి వెండితెరపై కనిపిస్తుందా? అన్నది చూడాల్సి ఉంది.