हिन्दी | Epaper
రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్

బ్యాడ్మింటన్ ప్లేయర్.. ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరో..

Divya Vani M
బ్యాడ్మింటన్ ప్లేయర్.. ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరో..

తెలుగు చిత్ర పరిశ్రమలో విశిష్టమైన గుర్తింపు సాధించిన హీరో సుధీర్ బాబు గురించి మీకు తెలుసా? వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకుల మన్ననలు పొందిన ఈ నటుడు,తక్కువ సమయంలోనే స్టార్ డమ్ సాధించాడు. ప్లాప్, హిట్‌లతో సంబంధం లేకుండా,తన ప్రతిభతో అలరిస్తూ సినీ ప్రపంచంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం దక్కించుకున్నాడు.సుధీర్ బాబు సినీరంగంలోకి రావడానికి ముందు బ్యాడ్మింటన్ ప్లేయర్‌గా సత్తా చాటారు. ఆంధ్రప్రదేశ్‌లో నంబర్ వన్ ర్యాంక్ సాధించడమే కాకుండా, తన ఆటతో క్రీడాకారుడిగా ప్రత్యేక గుర్తింపు పొందారు. పుల్లెల గోపీచంద్‌తో జతకట్టి డబుల్స్‌లో ఆడిన అనుభవం కూడా ఉంది.తాజాగా, సుధీర్ బాబు బ్యాడ్మింటన్ రన్నరప్ మెడల్ అందుకుంటున్న ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఫోటో చూసి ఆయన అభిమానులు మరియు నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

సుధీర్ బాబు అనేకమంది స్టార్ కుటుంబ సభ్యుడైనా, వారి పేరును ఉపయోగించకుండా, స్వతహాగా తన ప్రతిభతో నటుడిగా ఎదిగాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు బావ, అలాగే దివంగత నటుడు కృష్ణ అల్లుడైన సుధీర్, 2012లో ‘ఏమాయ చేసావే’ సినిమాతో వెండితెరపై అడుగుపెట్టాడు.ఆ తర్వాత ‘శివ మనసులో శ్రుతి’ చిత్రంతో హీరోగా మారి తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.సుధీర్ బాబు నటనలో ప్రత్యేకత ఏమిటంటే, ఎప్పుడూ వైవిధ్యమైన కథలను ఎంచుకోవడమే. హిట్,ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా తన పాత్రల్లో కొత్తదనాన్ని చూపిస్తూ, తెలుగు ప్రేక్షకులకు తనదైన ముద్ర వేశాడు. నటుడిగా మాత్రమే కాకుండా, వ్యక్తిగతంగా కూడా నెటిజన్ల ప్రశంసలు అందుకుంటూ ముందుకు సాగుతున్నాడు.ఇటీవలే సుధీర్ బాబు తనయుడు కూడా సినీ రంగంలోకి అడుగుపెట్టబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది అభిమానులలో ఆసక్తిని పెంచింది. కేవలం ఒక నటుడిగానే కాకుండా, తన కుటుంబ వారసత్వాన్ని కూడా నిలబెట్టే ప్రయత్నంలో ఉన్నారు. సుధీర్ బాబు జీవిత ప్రయాణం, క్రీడాకారుడి నుండి ప్రముఖ నటుడిగా మారడం, ఎంతో మందికి ప్రేరణ కలిగించే విధంగా ఉంది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870