हिन्दी | Epaper
రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్

ప్రేమ పెళ్లిపై నిర్ణయాలు మారాయి బాలీవుడ్ హీరో.

Divya Vani M
ప్రేమ పెళ్లిపై నిర్ణయాలు మారాయి బాలీవుడ్ హీరో.

వివేక్ ఒబెరాయ్ ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయం.బాలీవుడ్‌లో స్టార్ హీరోగా ఎన్నో విజయవంతమైన సినిమాలు అందించిన ఆయన, రక్త చరిత్ర సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు.ఒకప్పుడు ప్రేమ వ్యవహారాలతో వార్తల్లో నిలిచిన ఈ నటుడు,కెరీర్‌లో ఎదురైన ఒడిదుడుకుల తర్వాత కొత్త ఆశతో ముందుకు సాగుతున్నారు. తన జీవితంలోని తొలిప్రేమ గురించి తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో వివేక్ ఓపికగా మాట్లాడారు.13 ఏళ్ల వయసులోనే ప్రేమలో పడ్డాను. ఆమె నాకంటే ఏడాది చిన్నది. 18 సంవత్సరాల వయసులోనప్పుడు,ఆమెతో నా భవిష్యత్తు గురించి కలలు కన్నారు.పెళ్లి, పిల్లలు అన్నీ ఊహించుకున్నాను, అని చెప్పారు.కానీ,ఈ ప్రేమకథ దురదృష్టవశాత్తు విషాదాంతమైంది.ఒకరోజు ఆమె ఆరోగ్యం సరిగాలేదని చెప్పింది.జ్వరం అనుకున్నాను, విశ్రాంతి తీసుకుని తిరిగి వస్తుందని భావించాను.కానీ, ఆమె పలకరించలేదు. ఫోన్ చేసినా స్పందన లేకపోవడంతో ఆమె బంధువులకు ఫోన్ చేయగా, ఆసుపత్రిలో ఉందని చెప్పారు. ఆసుపత్రికి వెళ్లినప్పుడు తెలిసింది,ఆమెకు క్యాన్సర్ చివరి దశలో ఉందని.

ఆసుపత్రిలో బెడ్‌పై ఆమెను చూసి తట్టుకోలేకపోయాను.రెండు నెలల్లోనే ఆమె కన్నుమూసింది,” అని వివేక్ భావోద్వేగంతో చెప్పుకున్నారు.ఆ ఘటన తనపై తీవ్ర ప్రభావం చూపిందని,ఆ బాధను మరిచి మళ్లీ సాధారణ జీవితంలోకి రావడానికి చాలా సమయం పట్టిందని చెప్పారు.ఈ అనుభవం తనను క్యాన్సర్ బాధిత చిన్నారులకు సహాయం చేయాలనే ఆలోచనకు ప్రేరేపించిందని తెలిపారు.తొలి ప్రేమ విషాదాంతం తర్వాత, వివేక్ జీవితంలో మరికొన్ని ఎదురుదెబ్బలు ఎదురయ్యాయి. ఈ కారణంగా ఒక దశలో పెళ్లి చేసుకోకూడదని కూడా నిర్ణయించుకున్నానని వెల్లడించారు. కానీ కుటుంబసభ్యుల ఒత్తిడి వల్ల ప్రియాంకను కలిశానని, ఆమెతో 2010లో వివాహం జరిగిందని చెప్పుకొచ్చారు. బాలీవుడ్‌లో స్టార్ ఇమేజ్ తగ్గినా, వివేక్ తన నటనపై ఉన్న ప్రేమతో కొత్త అవకాశాల కోసం కృషి చేశారు. తెలుగు, కన్నడ, మలయాళం చిత్రాలలోను నటిస్తూ తనకంటూ కొత్త మార్కెట్‌ను సృష్టించుకున్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870