हिन्दी | Epaper
రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్

ఇక్కడ నాకు సాయం చేయడానికి ఎవరూ లేరు..డైరెక్టర్ గౌతమ్ మీనన్

Divya Vani M
ఇక్కడ నాకు సాయం చేయడానికి ఎవరూ లేరు..డైరెక్టర్ గౌతమ్ మీనన్

దక్షిణాది చిత్రపరిశ్రమలో గౌతమ్ మీనన్ అనేది ప్రత్యేక స్థానం సంపాదించుకున్న దర్శకుడు.తన సినీ ప్రయాణంలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు అందించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.2001లో మాధవన్ నటించిన “మిన్నెలే” చిత్రంతో దర్శకుడిగా తెరంగేట్రం చేసిన గౌతమ్, ఆ సినిమాతోనే భారీ విజయాన్ని సాధించాడు.ఆ తర్వాత హారిస్ జయరాజ్ సంగీతం అందించిన పాటలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.అలా తన మొదటి సినిమాతోనే గౌతమ్ మీనన్‌కు ప్రత్యేక గుర్తింపు ఏర్పడింది.తెలుగు, తమిళ భాషల్లో విజయవంతమైన చిత్రాలను రూపొందించిన గౌతమ్, అక్కినేని నాగచైతన్య, సమంత జంటగా నటించిన “ఏ మాయ చేశావే” సినిమాతో తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.అయితే, ఇటీవల గౌతమ్ మీనన్ తీసిన కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆడలేదు.ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న గౌతమ్ మీనన్ తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు.ఇండస్ట్రీలో తనకు అవసరమైన సమయంలో ఎవరూ సాయం చేయలేదని గౌతమ్ ఆవేదన వ్యక్తం చేశాడు.”ఈ విషయాన్ని చెప్పడం చాలా బాధగా ఉంది. నేను తీసిన ‘ధ్రువ నక్షత్రం’ విడుదల విషయంలో ఎవరూ స్పందించలేదు.

కనీసం ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి కూడా ప్రయత్నించలేదు. ఇండస్ట్రీ ఈ సినిమాను పట్టించుకోలేదు.ధనుష్,లింగుస్వామి మాత్రమే దీని గురించి అడిగారు. విడుదల చేయడానికి ప్రయత్నించారు. కానీ కొన్ని స్టూడియోలు సినిమాను స్వీకరించలేదు.ప్రేక్షకులు నా సినిమాలు చూడాలని కోరుకుంటున్నారు.

అందుకే నేను ఇంకా నిలబడగలుగుతున్నాను,”అని గౌతమ్ అన్నారు.2016లో విక్రమ్ హీరోగా నటించిన “ధ్రువ నక్షత్రం” చిత్రానికి గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించాడు. అయితే,అనేక సమస్యల కారణంగా ఈ సినిమా చిత్రీకరణ ఆగిపోయి విడుదల కాలేదు. ఈ సినిమా విడుదల తేదీని పలుమార్లు ప్రకటించినా,వివిధ కారణాలతో సినిమా వాయిదా పడుతూ వచ్చింది. ఈ సమస్యలపై స్పందించిన గౌతమ్, తనకు ఎవరూ సహాయం చేయలేదని తెలిపారు.గౌతమ్ మీనన్ మాటలలో అసంతృప్తి స్పష్టంగా కనిపించగా, ఆయన ఎదుర్కొంటున్న సవాళ్లు సినిమాపై ఆయనకు ఉన్న ప్రేమను మరింత బలపరిచాయి.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870