Vijay Sethupathi box office : 2025 బాక్సాఫీస్ పరంగా మక్కల్ సెల్వన్ Vijay Sethupathi కి మిశ్రమ అనుభవంగా మారింది. గతేడాది వరుసగా హిట్లు అందుకున్న ఆయన, ఈ ఏడాది మాత్రం అర్థం–అర్థం ఫలితాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయినప్పటికీ, సంవత్సరం చివరికి 50 శాతం విజయ శాతాన్ని నమోదు చేయడం విశేషం.
2025 ప్రారంభం విజయ్ సేతుపతికి ఆశించిన విధంగా సాగలేదు. మే 23న విడుదలైన Ace సినిమా మిక్స్‌డ్ రివ్యూలు అందుకుంది. సరైన బజ్ లేకపోవడంతో బాక్సాఫీస్ వద్ద ఆశించిన వసూళ్లు రాబట్టలేకపోయింది. సుమారు రూ.20 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం కేవలం రూ.8.97 కోట్ల నెట్ మాత్రమే వసూలు చేసి ఫ్లాప్‌గా నిలిచింది.
Read Also: TG: ఈరోజు నుంచి అందుబాటులోకి టెట్ హాల్ టికెట్లు
అయితే ఈ నిరాశ ఎక్కువ కాలం కొనసాగలేదు. (Vijay Sethupathi box office) జూలై 25న విడుదలైన Thalaivan Thalaivii తో విజయ్ సేతుపతి గట్టి కమ్‌బ్యాక్ ఇచ్చాడు. విమర్శకుల నుంచి మిక్స్‌డ్ స్పందన వచ్చినా, ప్రేక్షకుల్లో మంచి వర్డ్ ఆఫ్ మౌత్ రావడంతో సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్లింది. రూ.25 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం రూ.59.36 కోట్ల నెట్ వసూళ్లు సాధించి 137%కు పైగా రిటర్న్స్‌తో సూపర్ హిట్‌గా నిలిచింది.
ఈ విధంగా ఒక ఫ్లాప్, ఒక హిట్‌తో 2025లో విజయ్ సేతుపతి 50% సక్సెస్ రేషియోతో ఏడాదిని ముగించాడు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: