हिन्दी | Epaper
రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్

Upendra : హీరో ఉపేంద్ర ప్రియాంక ఫోన్లు హ్యాక్, సైబర్ నేరాలపై హెచ్చరిక

Sai Kiran
Upendra  : హీరో ఉపేంద్ర  ప్రియాంక ఫోన్లు హ్యాక్, సైబర్ నేరాలపై హెచ్చరిక

Upendra : సైబర్‌ నేరాలు రోజు రోజుకి పెరుగుతున్నాయి. సాధారణ ప్రజలతో పాటు సెలబ్రిటీలు కూడా సైబర్‌ కేటుగాళ్ల బారిన పడుతున్నారు. తాజాగా కన్నడ స్టార్‌ (Upendra) ఉపేంద్ర, ఆయన భార్య ప్రియాంక ఫోన్లు హ్యాక్ అయ్యాయి.

ఈ విషయాన్ని స్వయంగా ఉపేంద్ర సోషల్ మీడియా ద్వారా తెలిపారు. తమ పేరుతో ఎవరైనా ఫోన్ చేసి డబ్బులు అడిగినా, లేదా మెసేజ్ చేసినా స్పందించవద్దని విజ్ఞప్తి చేశారు. అంతేకాదు, ఈ ఘటనపై పోలీసులు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.

హ్యాకింగ్ ఎలా జరిగింది?

ప్రియాంక ఉపేంద్ర ఆన్లైన్‌లో ఆర్డర్ చేసిన వస్తువుకు సంబంధించి సోమవారం ఉదయం ఒక ఫోన్ కాల్ వచ్చింది. డెలివరీ కోసం కొన్ని హ్యాష్‌ ట్యాగ్‌లు, ఓటీపీలు ఎంటర్ చేయాలని చెప్పారు. ఆ తర్వాత ఆమె ఫోన్ హ్యాక్ అయ్యింది. కొంతసేపటి తర్వాత ఉపేంద్ర ఫోన్ కూడా హ్యాక్ అయిందని ఆయన తెలిపారు.

ప్రజలకు హెచ్చరిక

తమ నంబర్ల నుంచి వచ్చే మెసేజ్‌లు, సోషల్ మీడియా అకౌంట్ల నుంచి వచ్చే రిక్వెస్టులను పట్టించుకోవద్దని, డబ్బు అడిగినా నమ్మవద్దని ఉపేంద్ర రిక్వెస్ట్ చేశారు. సైబర్ నేరాల పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఉపేంద్ర – తెలుగు ప్రేక్షకులతో అనుబంధం

కన్నడ హీరో అయినా ఉపేంద్రకి తెలుగులో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ‘A’, ‘రా’, ‘ఉపేంద్ర’, ‘బుద్ధిమంతుడు’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారు. ఆయన ‘కన్యాదానం’, ‘ఒకే మాట’, ‘నీతోనే ఉంటాను’, ‘టాస్’ వంటి తెలుగు స్ట్రెయిట్ చిత్రాల్లో నటించారు.

అల్లు అర్జున్ హీరోగా వచ్చిన ‘సన్నాఫ్ సత్యమూర్తి’ మూవీలో కీలక పాత్ర పోషించారు. ఇటీవల తెలుగులో ‘గని’ సినిమాలో కనిపించారు. అలాగే, ‘కూలీ’ సినిమాలో స్పెషల్ రోల్ చేశారు. ప్రస్తుతం రామ్ పోతినేని హీరోగా తెరకెక్కుతున్న ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ సినిమాలో ఉపేంద్ర నటిస్తున్నారు. ఇందులో ఆయన ఒక సూపర్ స్టార్ క్యారెక్టర్ పోషిస్తున్నారు.

Read also :

https://vaartha.com/itr-filing-deadline-extended-september-16-last-chance/business/548130/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870