తమ పెద్ద మనసుతో సూర్య, కార్తి మరోసారి వార్తల్లోకి వచ్చారు. ఈ సారి వారు బహుమతి ఇచ్చింది సినిమా కాదు… కార్! ‘96’ సినిమాతో దర్శకుడిగా గుర్తింపు పొందిన ప్రేమ్‌కుమార్‌కు, ఆయన కలల కారును గిఫ్ట్‌గా ఇచ్చి ఆశ్చర్య పరిచారు.ప్రేమ్‌కుమార్ చాలా కాలంగా ఒక స్పెషల్ కార్ కోసం ఎదురు చూస్తున్నారు. మహీంద్రా థార్ – తెలుపు రంగులో, 5 డోర్ వెర్షన్ – ఆయనకు ఎంతో ఇష్టం. అయితే ఖరీదుతో పాటు, డెలివరీ డిలేయ్‌ల కారణంగా ఈ కలను కొంతకాలం పక్కన పెట్టాల్సి వచ్చింది. కానీ ఆయన ఊహించని విధంగా ఆ కార్‌ను గిఫ్ట్‌గా పొందారు!

బహుమతి వెనుక ఉన్న బంధం
‘మెయ్యళగన్’ అనే తమిళ చిత్రానికి ప్రేమ్‌కుమార్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో కార్తి, అరవింద్ స్వామి నటించగా, సూర్య – జ్యోతిక దంపతులు నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ ప్రాజెక్ట్ సమయంలో సూర్య, కార్తి – ప్రేమ్‌కుమార్ మధ్య మంచి అనుబంధం ఏర్పడింది.ఈ అనుబంధమే, ఈ సర్‌ప్రైజ్‌కు మూలం. సూర్య స్వయంగా కారును కొనుగోలు చేసి, సోదరుడు కార్తి ద్వారా ప్రేమ్‌కుమార్‌కు అందజేశారు. ఈ గిఫ్ట్‌తో ప్రేమ్‌కుమార్ చాలా భావోద్వేగానికి గురయ్యారు.
ప్రేమ్‌కుమార్ భావోద్వేగ పోస్ట్
సోషల్ మీడియాలో ప్రేమ్‌కుమార్ ఒక హృద్యమైన పోస్ట్ వేశారు. “నాకు మహీంద్రా థార్ అంటే చాలా ఇష్టం. ప్రత్యేకంగా తెలుపు రంగులో ఉండే 5-డోర్ వేరియంట్ కోసం చాలా కాలంగా ఎదురు చూశాను. కానీ, నా దగ్గర ఉన్న డబ్బు ఇతర అవసరాలకు ఖర్చయింది. కారు కలను వదిలేసాను,” అని పేర్కొన్నారు.అయితే, ఒక్కరోజు సూర్య పంపిన సందేశం మారిపోయింది. “కారు వచ్చేసింది” అని మెసేజ్ రావడంతో మొదట అవాక్కయ్యానని చెప్పారు. వెంటనే ఫొటో చూసి ఆశ్చర్యపోయానట. కార్తి చేతుల మీదుగా తాళాలు అందుకున్నానంటూ చెప్పారు.
ఈ బహుమతి కంటే విలువైనది ఏముంటుంది?
ప్రేమ్‌కుమార్ ఈ గిఫ్ట్‌ను ఒక తమ్ముడి కలను అన్న నెరవేర్చినట్టు భావించారు. “ఇది కేవలం కారు కాదు… స్నేహానికి, బంధానికి చిహ్నం. సూర్య అన్న, కార్తి అన్నలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు” అంటూ చెప్పుకొచ్చారు.
Read Also : Actor: నేను ఏమీ ఎక్కువగా ఖర్చు పెట్టే వ్యక్తిని కాదు: సుమంత్