డాన్ 3 సినిమా నిర్మాణం మొదటి నుంచే అనేక అడ్డంకులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ ప్రాజెక్ట్‌పై తాజాగా వచ్చిన వార్తలు అభిమానుల్లో ఆందోళన పెంచుతున్నాయి. దర్శకుడు ఫర్హాన్ అక్తర్ ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న డాన్ సిరీస్ మూడో భాగంపై భారీ అంచనాలే ఉన్నాయి.
Read also: Director Maruthi interview : డైరెక్టర్ మారుతి మాటలపై ప్రభాస్ ఫ్యాన్స్ ఫైర్..! ‘రాజా సాబ్’

“దురందర్” తర్వాత మారిన రణ్వీర్ నిర్ణయం
డాన్ 3లో హీరోగా రణ్వీర్ సింగ్(RanveerSingh) నటించనున్నట్లు గతంలో అధికారిక ప్రకటన వెలువడింది. అయితే తాజాగా పరిస్థితి పూర్తిగా మారినట్లు సమాచారం. “దురందర్” సినిమా విడుదల అనంతరం రణ్వీర్ సింగ్ కెరీర్ కొత్త ఎత్తులకు చేరింది. ఈ దశలో డాన్ 3 వంటి రీమేక్/సిరీస్ చిత్రంలో నటిస్తే అనవసర విమర్శలు ఎదురయ్యే అవకాశం ఉందనే ఆలోచనతో ఆయన ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి.
డాన్ 3 భవితవ్యం ఏంటి?
రణ్వీర్ సింగ్(RanveerSingh) వైదొలగిన వార్తలు నిజమైతే, డాన్ 3కు ఇది మరో పెద్ద ఎదురుదెబ్బగా మారనుంది. కొత్త హీరో ఎంపిక, షూటింగ్ షెడ్యూల్స్ కారణంగా సినిమా మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: