

హైదరాబాద్‌లో(Rahul Sipligunj) ఘనంగా జరిగిన వివాహ కార్యక్రమంలో ప్రముఖ గాయకుడు, ఆస్కార్ అవార్డ్ గ్రహీత రాహుల్ సిప్లిగంజ్ తన ప్రియురాలు హరిణ్యతో వివాహ బంధంలో అడుగుపెట్టారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో గురువారం తెల్లవారుని ఈ వేడుక జరిగింది. వివాహానికి హాజరైన సినీ మరియు రాజకీయ ప్రముఖులు కొత్త దంపతులకు ఆశీర్వాదాలు అందించారు. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Read also: “అలా మాట్లాడే వాళ్లు ఉప ముఖ్యమంత్రులా?”

ఆస్కార్ అవార్డు విజేత రాహుల్ సిప్లిగంజ్ విజయాల పథం
రాహుల్ సిప్లిగంజ్(Rahul Sipligunj) ఆర్ఆర్ఆర్ సినిమాలోని “నాటు నాటు” పాటకు ఆస్కార్ అవార్డు గెలుచుకున్న విషయం తెలిసిందే. ఈ పాటను రాహుల్ సిప్లిగంజ్ మరియు కాలభైరవ్ కలిసి పాడారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన గద్దర్ అవార్డుల వేడుకలో సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) రాహుల్ సిప్లిగంజ్ ను ప్రత్యేకంగా ప్రశంసించారు. పాతబస్తీ నుంచి ఆస్కార్ వరకూ సాగిన రాహుల్ సిప్లిగంజ్ విజయం, ప్రతిభకు ఎంతోమంది అభిమానులు కృతజ్ఞతలు తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: