हिन्दी | Epaper
రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్

పోసానికి పోలీస్ కస్టడీ..రేపు, ఎల్లుండి విచారణ

Divya Vani M
పోసానికి పోలీస్ కస్టడీ..రేపు, ఎల్లుండి విచారణ

పోసానికి పోలీస్ కస్టడీ..రేపు, ఎల్లుండి విచారణ టాలీవుడ్ నటుడు పోసాని కృష్ణమురళికి కేసుల చిక్కులు ఇప్పట్లో తీరేలా లేవు.ఒక కేసులో బెయిల్ రావడంతో ఊపిరిపీల్చుకునేలోపే, మరో కేసులో కస్టడీ విధించడంతో మళ్లీ చిక్కుల్లో పడ్డారు.తాజా పరిణామాల ప్రకారం నరసరావుపేట కోర్టు ఆయనపై పోలీస్ కస్టడీ విధించింది. ప్రముఖ రాజకీయ నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబు,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌లపై పోసాని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో టీడీపీ నేత కిరణ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పల్నాడు పోలీసులు ఈ కేసును నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో పోసానిని పీటీ వారెంట్ ద్వారా అదుపులోకి తీసుకున్న నరసరావుపేట పోలీసులు కోర్టులో హాజరుపరిచారు.

పోసానికి పోలీస్ కస్టడీ..రేపు, ఎల్లుండి విచారణ
పోసానికి పోలీస్ కస్టడీ..రేపు, ఎల్లుండి విచారణ

విచారణ అనంతరం, కోర్టు పోసాని కృష్ణమురళికి ఈ నెల 13 వరకు రిమాండ్ విధించింది.ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేయాలనే ఉద్దేశంతో పోలీసులు పోసానిని తమ కస్టడీలోకి అప్పగించాలని కోర్టును కోరారు.దాంతో కోర్టు ఈ రోజు విచారణ నిర్వహించి పోసానిని రెండు రోజుల కస్టడీకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.కోర్టు ఆదేశాలతో నరసరావుపేట పోలీసులు రేపు, ఎల్లుండి అతనిని కస్టడీలోకి తీసుకుని విచారణ చేపట్టనున్నారు.అంతేకాదు ఏపీలో పోసానిపై ఇప్పటివరకు 17 కేసులు నమోదైనట్టు సమాచారం. ఆయా కేసుల పరిణామాలను పరిశీలిస్తే,అతని పరిస్థితి మరింత క్లిష్టంగా మారే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ కేసులపై విచారణ ఎలా కొనసాగుతుందో వేచి చూడాలి.ఇకపోతే పోసాని తనపై వచ్చిన ఆరోపణలపై ఇంకా ఎటువంటి అధికారిక స్పందన ఇవ్వలేదు. అయితే త్వరలోనే ఈ వివాదంపై తన వైఖరి వెల్లడించే అవకాశం ఉందని అనుకుంటున్నారు.

ప్రస్తుతం ఈ కేసు టాలీవుడ్, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సినీ పరిశ్రమలోనూ దీనిపై విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పోసాని రాజకీయ విషయాల్లో తన అభిప్రాయాలను ఓపెన్‌గా చెప్పడమే కాక, అధికార పార్టీపై తీవ్ర వ్యాఖ్యలు చేయడం వల్లే ఈ స్థితి ఏర్పడిందని కొందరు అంటున్నారు.మరోవైపు ఆయన మాటల తీరును వ్యతిరేకిస్తూ, టీడీపీ శ్రేణులు గట్టిగా విమర్శలు చేస్తున్నారు. ఈ కేసు ఏమేరకు ముందుకెళ్తుందో చూడాలి.ఇంతలోనే మరిన్ని మలుపులు తిరగొచ్చన్న ఆసక్తి కూడా ఉంది

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870