టాలీవుడ్ హీరో నారా రోహిత్,(Nara Rohit) నటి సిరిలేళ్ల త్వరలో వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నారు. ఇటీవలే వీరి పెళ్లి పనులు కూడా ప్రారంభమైనట్లు తెలుపుతూ, సిరిలేళ్ల పసుపు దంచే కార్యక్రమం ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ నేపథ్యంలో, అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న వీరి వివాహ తేదీకి సంబంధించిన అప్‌డేట్ తాజాగా నెట్టింట వైరల్ అవుతోంది. ఈ జంట అక్టోబర్ 30న వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నట్లు సమాచారం. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో ఆ రోజు మూడు ముళ్ల బంధంతో ఈ జంట ఒకటి కానుంది.
Read Also: Telangana: 30న విద్యాసంస్థలకు బంద్ పిలుపునీచిన ఎస్ఎఫ్‌ఐ

హైదరాబాద్‌లో నాలుగు రోజుల వేడుకలు
నారా రోహిత్(Nara Rohit), సిరిలేళ్ల వివాహ వేడుకలు దాదాపు నాలుగు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. హైదరాబాద్‌లో(Hyderabad) పలు వేదికల్లో ఈ వేడుకలు ఏర్పాటు చేశారు. తెల్లాపూర్‌లోని మండువా ప్రాంగణంలో హల్దీ వేడుకలతో వివాహ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ఆ తర్వాత, ఐటీసీ గ్రాండ్ కాకతీయలో ‘పెళ్లి కొడుకును చేసే’ వేడుక నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. అనంతరం మళ్లీ మండువా ప్రాంగణంలో మెహందీ వేడుక జరగనున్నట్లు సమాచారం. వీరి వివాహ వేడుకలకు సినీ తారలు మరియు రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read also: