Monalisa love marriage : గత ఏడాది ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన కుంభమేళాలో పూసలు అమ్ముకుంటూ సోషల్ మీడియాలో వైరల్ అయిన మోనాలిసా భోస్లే మరోసారి వార్తల్లో నిలిచింది. ఈసారి ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఘటనతో చర్చనీయాంశంగా మారింది.
కుటుంబ సభ్యులు తమ ప్రేమను అంగీకరించకపోవడంతో మోనాలిసా తన ప్రియుడు ఫర్మాన్ ఖాన్‌తో కలిసి కేరళలో పోలీసులను ఆశ్రయించింది.
కేరళలో పోలీసుల వద్ద ఫిర్యాదు
మోనాలిసా ఇటీవల ఒక సినిమా షూటింగ్ కోసం కేరళకు వెళ్లింది. ఎర్నాకులంలో ఉండగా ఆమెకు తన కుటుంబ సభ్యులతో వివాదాలు తలెత్తినట్లు సమాచారం. అనంతరం ఆమె తన ప్రియుడు ఫర్మాన్ ఖాన్‌తో కలిసి ట్రైన్‌లో తిరువనంతపురం వెళ్లింది.
అక్కడికి చేరుకున్న తర్వాత ఇద్దరూ కలిసి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తమకు రక్షణ కల్పించాలని కోరారు.
కుటుంబం వ్యతిరేకత
మోనాలిసా పోలీసులకు ఇచ్చిన వివరాల ప్రకారం మహారాష్ట్రకు చెందిన ఫర్మాన్ ఖాన్‌తో తనకు దాదాపు ఏడాదిన్నర కాలంగా ప్రేమ సంబంధం కొనసాగుతోంది. అయితే తన కుటుంబ సభ్యులు ఈ సంబంధాన్ని అంగీకరించకుండా వేరే వ్యక్తితో పెళ్లి చేయాలని ప్రయత్నిస్తున్నారని తెలిపింది.
అందుకే తాను ఫర్మాన్ ఖాన్‌తోనే జీవించాలని నిర్ణయించుకున్నట్లు పోలీసులకు వెల్లడించింది.
Read Also: Pawan Kalyan: ‘ఉస్తాడ్ భగత్ సింగ్’ సెన్సార్ పూర్తి.. రన్‌టైమ్ ఫిక్స్

ఆలయంలో పెళ్లి?
పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మోనాలిసా, ఆమె ప్రియుడు తిరువనంతపురంలోని ఆరుమనూర్ ఆలయానికి వెళ్లినట్లు సమాచారం. అక్కడే వీరిద్దరూ వివాహం చేసుకునే అవకాశం ఉందని స్థానికంగా వార్తలు వినిపిస్తున్నాయి.
ఇక ఈ ఘటనతో సోషల్ మీడియాలో మరోసారి మోనాలిసా పేరు వైరల్ అవుతోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: