हिन्दी | Epaper

Monalisa bhosle marriage : పెళ్లి చేసుకున్న కుంభమేళా వైరల్ బ్యూటీ మోనాలిసా

Sai Kiran
Monalisa bhosle marriage : పెళ్లి చేసుకున్న కుంభమేళా వైరల్ బ్యూటీ మోనాలిసా

Monalisa bhosle marriage : కుంభమేళా సమయంలో పూసలు అమ్ముతూ సోషల్ మీడియాలో వైరల్ అయిన మోనాలిసా భోస్లే తాజాగా వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. కేరళలోని తిరువనంతపురంలో ఉన్న ఒక ఆలయంలో తన ప్రియుడు ఫర్మన్ ఖాన్‌ను పెళ్లి చేసుకుంది.

ఈ వివాహ వేడుకకు కేరళ మంత్రి వి. శివన్‌కుట్టి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి ఎం.వి. గోవిందన్‌తో పాటు సినిమా షూటింగ్ టీమ్ సభ్యులు కూడా హాజరైనట్లు సమాచారం.

పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు

పెళ్లికి ముందు మోనాలిసా తన ప్రియుడితో కలిసి పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించింది. తామిద్దరం ప్రేమించుకున్నామని, కానీ తమ ప్రేమను కుటుంబ సభ్యులు అంగీకరించడం లేదని పోలీసులకు తెలిపింది.

తన తల్లిదండ్రుల నుంచి రక్షణ కల్పించాలని కోరిన తర్వాత పోలీసుల సమక్షంలోనే ఆ జంట ఆలయానికి వెళ్లి వివాహం చేసుకుంది.

వరుడు ఎవరు?

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన మోనాలిసాకు మహారాష్ట్రకు చెందిన ఫర్మాన్ ఖాన్‌తో సోషల్ మీడియా ద్వారా పరిచయం ఏర్పడింది. ఫేస్‌బుక్‌లో మొదలైన ఈ పరిచయం క్రమంగా ప్రేమగా మారింది.

గత ఏడాదిన్నరగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు. అయితే మతాలు వేరు కావడంతో ఈ పెళ్లికి మోనాలిసా కుటుంబ సభ్యులు అంగీకరించలేదు.

Read Also: Velugumatla Victims: ఖమ్మంలో ఫలించిన బీఆర్ఎస్ పోరాటం..311 మంది బాధితులకు రేపు పట్టాలు

ప్రేమకథ ఇలా మొదలైంది

సినిమా షూటింగ్ కోసం మోనాలిసా (Monalisa bhosle marriage) ఇటీవల కేరళకు వెళ్లింది. అక్కడికి ఆమె తండ్రి కూడా చేరుకోవడంతో కుటుంబంలో వాగ్వాదం జరిగింది. చివరికి తమకు ప్రాణహాని ఉందని భావించిన మోనాలిసా తన ప్రియుడితో కలిసి తిరువనంతపురానికి వెళ్లింది.

అక్కడ పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత ఇద్దరూ ఆలయంలో వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ పెళ్లి వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also :

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

పెళ్లి చేసుకున్న కుంభమేళా వైరల్ బ్యూటీ మోనాలిసా

పెళ్లి చేసుకున్న కుంభమేళా వైరల్ బ్యూటీ మోనాలిసా

బాయ్‌ఫ్రెండ్‌తో మోనాలిసా జంప్, పోలీసుల వద్ద ఆశ్రయం

బాయ్‌ఫ్రెండ్‌తో మోనాలిసా జంప్, పోలీసుల వద్ద ఆశ్రయం

‘తండేల్’ చిత్రానికి గద్దర్ ఫిల్మ్ అవార్డు.. ప్రభుత్వానికి చైతూ కృతజ్ఞతలు

‘తండేల్’ చిత్రానికి గద్దర్ ఫిల్మ్ అవార్డు.. ప్రభుత్వానికి చైతూ కృతజ్ఞతలు

అది ఎంగేజ్‌మెంట్ కాదు – బెల్లంకొండ శ్రీనివాస్ క్లారిటీ

అది ఎంగేజ్‌మెంట్ కాదు – బెల్లంకొండ శ్రీనివాస్ క్లారిటీ

టీమ్ ఇండియా విజయం పై అమితాబ్ బచ్చన్ ఆసక్తికర ట్వీట్

టీమ్ ఇండియా విజయం పై అమితాబ్ బచ్చన్ ఆసక్తికర ట్వీట్

మహిళా దినోత్సవం వేళ అమ్మకు ఖరీదైన కానుక

మహిళా దినోత్సవం వేళ అమ్మకు ఖరీదైన కానుక

ఓటీటీలోకి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’.. డేట్ ఫిక్స్!

ఓటీటీలోకి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’.. డేట్ ఫిక్స్!

అడ్వాన్స్ బుకింగ్స్‌లో ‘ఉస్తాద్’ సంచలనం!

అడ్వాన్స్ బుకింగ్స్‌లో ‘ఉస్తాద్’ సంచలనం!

విజయ్‌కు మూడోసారి సీబీఐ నోటీసులు

విజయ్‌కు మూడోసారి సీబీఐ నోటీసులు

“జగన్ గారు… నా జోలికి రావద్దు.. శివాజీ

“జగన్ గారు… నా జోలికి రావద్దు.. శివాజీ

బెల్లంకొండ శ్రీనివాస్ ఎంగేజ్‌మెంట్, వధువు ఎవరో తెలుసా?

బెల్లంకొండ శ్రీనివాస్ ఎంగేజ్‌మెంట్, వధువు ఎవరో తెలుసా?

ట్రంప్‌కు కమల్ హాసన్ కౌంటర్

ట్రంప్‌కు కమల్ హాసన్ కౌంటర్

📢 For Advertisement Booking: 98481 12870