हिन्दी | Epaper
రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్

Kannappa : అన్నమయ్య జిల్లా ఊటుకూరు వెళ్లిన మంచు విష్ణు, కన్నప్ప టీమ్

Divya Vani M
Kannappa : అన్నమయ్య జిల్లా ఊటుకూరు వెళ్లిన మంచు విష్ణు, కన్నప్ప టీమ్

Kannappa : అన్నమయ్య జిల్లా ఊటుకూరు వెళ్లిన మంచు విష్ణు, కన్నప్ప టీమ్ డైనమిక్ హీరో విష్ణు మంచు తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప‘ ను భారీ స్థాయిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. మోహన్ బాబు నిర్మాణంలో రూపుదిద్దుకున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు.సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఇప్పటికే విడుదలైన టీజర్‌లు, పాటలు భారీ అంచనాలు పెంచాయి. వీటికి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. ఇక కన్నప్ప రిలీజ్ అయ్యేలోపు ద్వాదశ జ్యోతిర్లింగ దర్శనం చేస్తానని విష్ణు ముందుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా విష్ణు మంచు భక్త కన్నప్ప స్వగ్రామం అయిన అన్నమయ్య జిల్లా, రాజంపేట మండలంలోని ఊటుకూరు ను సందర్శించారు. గ్రామస్తులు ఆలయ సిబ్బంది విష్ణు మరియు కన్నప్ప టీమ్‌ను ఘనంగా సన్మానించారు.

Kannappa అన్నమయ్య జిల్లా ఊటుకూరు వెళ్లిన మంచు విష్ణు, కన్నప్ప టీమ్
Kannappa అన్నమయ్య జిల్లా ఊటుకూరు వెళ్లిన మంచు విష్ణు, కన్నప్ప టీమ్

విష్ణు కన్నప్ప కుటుంబ స్వగృహాన్ని సందర్శించి, అక్కడి శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ ఆలయ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ భారీ చిత్రంలో మోహన్ బాబు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, ప్రభాస్, కాజల్ అగర్వాల్, ప్రీతి ముకుందన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ముఖ్యంగా స్టీఫెన్ దేవస్సీ అందించిన సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది.ఇప్పటివరకు విడుదలైన పాటలు సంగీత ప్రియులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.’కన్నప్ప’ చిత్రాన్ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల చేయనున్నారు. ఏప్రిల్ 25న భారీ స్థాయిలో థియేటర్లలోకి రానున్న ఈ సినిమా, విష్ణు మంచుకు కెరీర్‌లోనే పెద్ద హిట్ అందిస్తుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870