ప్రఖ్యాత నటులు రజనీకాంత్ మరియు నందమూరి బాలకృష్ణకు అరుదైన సన్మానం లభించబోతోంది. గోవాలో నవంబర్ 20 నుంచి 28 వరకు జరగనున్న 56వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్(International Film Festival) ఆఫ్ ఇండియా (ఇఫి) ముగింపు మహోత్సవంలో ఈ ఇద్దరు నటులను ప్రత్యేకంగా సత్కరించనున్నట్లు కేంద్ర సమాచారం, ప్రసార శాఖ సహాయ మంత్రి ఎల్. మురుగన్ వెల్లడించారు.
Read Also: IBOMMA: రవి కేసులో షాకింగ్ విషయాలు.. కిక్కు కోసమే హ్యాకింగ్!

కేంద్ర మంత్రి మురుగన్, గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్‌తో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ నిర్ణయాన్ని ప్రకటిస్తూ, “సినీ పరిశ్రమలో 50 ఏళ్ల విశిష్ట ప్రయాణం పూర్తి చేయడం వీరిద్దరి కెరీర్‌లోనే కాదు, భారతీయ సినీరంగానికి కూడా గర్వకారణం. రజనీకాంత్, బాలకృష్ణ తమ నటనతో, సేవాభావంతో తరతరాలను ప్రభావితం చేశారు” అని అన్నారు.
1975లో ‘అపూర్వ రాగంగళ్’తో తన సినీ ప్రయాణం ప్రారంభించిన రజనీకాంత్,(Rajinikanth) ప్రత్యేక స్టైల్, విన్యాసాలతో అంతర్జాతీయ(International Film Festival) ఖ్యాతిని సంపాదించుకున్నాడు. మరోవైపు, బాలకృష్ణ నటుడిగానే కాక, సేవా కార్యక్రమాలతో కూడా ప్రజల్లో విశేష గౌరవం పొందారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న అఖండ 2 చిత్రం త్వరలో విడుదలకు సిద్ధంగా ఉంది.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read also :