తెలుగు నటుడు రానా దగ్గుబాటి (Rana Daggubati) సినిమా అతని జీవితాన్ని ఎలా (mold) చేసిందో తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికరంగా వెల్లడించాడు. చదువులో అసలు ఆసక్తి లేని తన బాల్యం నుంచి, ఓ హై క్లాస్ నటుడిగా ఎదిగిన తన ప్రయాణాన్ని ఎంతో సూటిగా వివరించాడు.రానా తాజాగా విడుదలైన “రానా నాయుడు-2” (“Rana Naidu-2”) ప్రమోషన్ సందర్భంగా IANSతో మాట్లాడాడు. పాఠశాల రోజులన్నీ కామిక్ పుస్తకాల మధ్యే గడిచాయి. చదువు అనేది నాతో ఎప్పుడూ దూరంగా ఉండేది, అని రానా నవ్వుతూ గుర్తుచేసుకున్నాడు. సినిమాలు, టీవీ షోలు చూసే అలవాటు వల్లే జీవితం పై అవగాహన పెరిగిందని అన్నాడు.
సినిమా ద్వారానే నేర్చుకున్న జీవిత సత్యాలు
నేను చెన్నైలో పుట్టాను, తర్వాత హైదరాబాద్, ఆపై ముంబైకి వెళ్లాను. ఈ మార్పులతో ఎన్నో కొత్త సంస్కృతులు చూశాను, అని తెలిపాడు రానా. సినిమా, కళలు అనేవి (rigid) గానో (predefined) గానో ఉండవు. అందుకే ఇవి నాకు బాగా నచ్చాయి, అని చెప్పాడు.
విభిన్నతకు విలువ ఇచ్చే కథలు చెప్పాలన్న ఉద్దేశం
మన దేశం విభిన్నతల మేళవింపు. ఇక్కడ ఏ ఒక్కరినీ ఒకే కోణంలో చూడలేరు. నా జీవితం సినిమాల వల్లే అమూల్యంగా మారింది. నేను చదివిన పుస్తకాల్లోకంటే, చూసిన చిత్రాల్లో నేర్చుకున్న పాఠాలే ఎక్కువ, అని రానా తెలిపాడు.ప్రేక్షకులు ప్రతిసారీ కొత్తదనం కోరుతారు. అందుకే ఎవ్వరూ చెప్పని కథలను తెరపై చూపించాలన్నదే నా లక్ష్యం, అని రానా అన్నారు. మీరు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారో తెలుసుకోవాలంటే, కళలే నిజమైన మార్గం, అని భావించారు.