చెన్నైలో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ కేసు (Drug case) ప్రస్తుతం దక్షిణ భారత సినిమా పరిశ్రమలో భారీ సంచలనంగా మారింది. తెలుగు, తమిళ చిత్రాల్లో పేరొందిన నటుడు శ్రీరామ్ (Sri Ram) అరెస్ట్ కావడం ఈ కేసును మరింత దృష్టిలోకి తెచ్చింది. చెన్నై పోలీసులు ఆయనను పట్టుకున్న తీరు, కేసులో చోటుచేసుకుంటున్న పరిణామాలు పరిశ్రమలో కలకలాన్ని రేపుతున్నాయి.తమిళనాడులో కీలక పాత్ర పోషించిన అన్నాడీఎంకే పార్టీ మాజీ కార్యనిర్వాహకుడు ప్రసాద్ డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడని సమాచారం ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు. అతడితో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా, వారి నోటి మీదుగా హీరో శ్రీరామ్ పేరు బయటపడింది. ఆయనకు డ్రగ్స్ సరఫరా చేశామని నిందితులు ఒప్పుకోవడంతో విచారణ దిశ మరో మలుపు తిరిగింది.
శ్రీరామ్ అరెస్ట్… కొకైన్ స్వాధీనం
ఈ నేపథ్యంలో శ్రీరామ్‌ను చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద కొకైన్ స్వాధీనం చేసుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. తరువాత వైద్య పరీక్షలు నిర్వహించి, అతన్ని నుంగంబాక్కం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అక్కడ ఆయన్ను మరింత గడిగా ప్రశ్నించారు.విచారణ అనంతరం శ్రీరామ్‌ను చెన్నై ఎగ్మోర్ కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం ఆయనను జ్యుడీషియల్ కస్టడీకి పంపుతూ జూలై 7 వరకు రిమాండ్ విధించింది. ప్రస్తుతం ఆయన జైలులో ఉన్నారు.
ఇండస్ట్రీలో డ్రగ్ మాఫియా దొంగచూపులు
ఈ కేసు వెలుగు చూసిన తరువాత నుంగంబాక్కం పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు ప్రారంభించారు. శ్రీరామ్‌ను కస్టడీలోకి తీసుకుని మళ్లీ విచారించాలని నిర్ణయించారు. ఇందుకోసం నేడు కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు. శ్రీరామ్‌ను ఆరా తీస్తే కోలీవుడ్‌కి చెందిన మరికొందరు ప్రముఖుల పేర్లు బయటపడే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.
Read Also : Sitting-Rising Test : ఇంట్లో ఈ చిన్న పరీక్షతో మరణ ముప్పును ముందే తెలుసుకోవచ్చు!