తల అజిత్ అంటే (Hero Ajith) హీరోగానే కాదు, రేసర్‌గా కూడా గుర్తింపు. సినీ ప్రెసెర్షర్ మధ్య కూడా అతడు ట్రాక్‌పై స్పీడ్ తగ్గించడు. యాక్షన్ సీన్లలో దూకుడుగా కనిపించే అజిత్, నిజ జీవితంలోనూ అంతే డేర్‌డెవిల్. 50 ఏళ్లు దాటినా అతడి వేగం తగ్గలేదు. ప్రతి రేస్‌లో (In the race) కొత్త ఎనర్జీతో దూసుకెళ్తున్నాడు.ఇటలీలో జరిగిన జీటీ4 యూరోపియన్ సిరీస్ రేస్‌లో అతడు ప్రమాదాన్ని ఎదుర్కొన్నాడు. మిసానో ట్రాక్‌పై నిలిచిన కారును ఢీకొన్నా, అతడికి ఎలాంటి గాయాలు కాలేదు. కానీ, రేస్ నుండి తప్పుకోవాల్సి వచ్చింది. స్పీడ్ అతడి జలవిద్య. అదే స్పీడ్ వల్లే కొన్ని సార్లు ప్రమాదాలు ఎదురైనా… అతడు వెనక్కి తగ్గడంలేదు లేదు.

ప్రమాదంలోనూ వినయం… నిజమైన హీరో!
ప్రమాదం జరిగిన తర్వాత ట్రాక్ క్లీన్ చేసే సిబ్బందికి సహాయం చేసిన అజిత్, తన వ్యక్తిత్వాన్ని మరోసారి నిరూపించాడు. అతడి వినయం, గౌరవం చూసి అభిమానులు గర్వపడుతున్నారు. కేవలం డ్రైవర్‌గానే కాకుండా, మానవతా విలువలు కలిగిన వ్యక్తిగా గుర్తింపు పొందుతున్నాడు.
రేసింగ్ పట్ల తల అజిత్ ప్యాషన్
2003లో ఫార్ములా బీఎండబ్ల్యూ ఆసియా ఛాంపియన్‌షిప్‌లో ప్రవేశించిన అజిత్, తర్వాత ఫార్ములా 2 లోనూ తన ప్రతిభను చాటాడు. మలేషియా, జర్మనీ వంటి దేశాల్లో పలు అంతర్జాతీయ పోటీల్లో పాల్గొన్నాడు. సినిమాలు, రేసింగ్ రెండింటినీ సమాంతరంగా నడుపుతున్నాడు.
పద్మభూషణ్‌తో గర్వించదగ్గ గుర్తింపు
2025లో అజిత్‌కు భారతదేశ మూడవ అత్యున్నత పురస్కారం పద్మభూషణ్ లభించింది. తెరపై మాస్ హీరోగా, రియల్ లైఫ్‌లో స్పీడ్ కింగ్‌గా తల అజిత్ ప్రయాణం కొనసాగుతోంది. రిస్క్‌తో కూడిన జీవితం అయినా, అతడు ఎప్పటికీ వెనక్కి తగ్గడు. ఆ ధైర్యమే అతడిని ప్రత్యేకంగా నిలబెడుతోంది.
Read Also : Tirumala : ప్రవాసాంధ్రులకు రోజూ వంద వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లు