हिन्दी | Epaper
రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్

సంధ్య థియేటర్ ఘటనలో ఊహించని ట్విస్ట్ ఇచ్చిన పోలీసులు..

Divya Vani M
సంధ్య థియేటర్ ఘటనలో ఊహించని ట్విస్ట్ ఇచ్చిన పోలీసులు..

హైదరాబాద్‌ సంధ్య థియేటర్‌లో ‘పుష్ప-2’బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనపై హైదరాబాద్‌ పోలీసులు కీలక వివరణ ఇచ్చారు.ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలను విడుదల చేస్తూ, ఘటనకు సంబంధించిన ప్రతి విషయం స్పష్టంగా వెల్లడించారు.పోలీస్ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ మాట్లాడుతూ, దర్యాప్తు కొనసాగుతోందని, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం ఖాయమని చెప్పారు.సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనపై విచారణ సాగుతున్నదని సీపీ తెలిపారు.ఈ సంఘటనకు సంబంధించిన సీసీ ఫుటేజ్‌ను మీడియా సమావేశంలో విడుదల చేశారు.మినిట్ టూ మినిట్ వివరాలు అందిస్తూ, తొక్కిసలాటకు కారణమైన పరిస్థితులను వివరించారు.”పబ్లిక్‌ను తోసివేసినా, బౌన్సర్లు ఎవరైనా దురుసుగా ప్రవర్తించినా కఠిన చర్యలు తీసుకుంటాం” అని స్పష్టంగా హెచ్చరించారు.బౌన్సర్ల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన సీపీ, సెలబ్రిటీలదే పూర్తి బాధ్యత అని వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు బౌన్సర్లను నియంత్రించే విధానాలను మార్చాలని సూచించారు.ఏజెన్సీలు, థియేటర్ యాజమాన్యం కూడా తమ బాధ్యతను గుర్తించి జాగ్రత్తలు పాటించాలని హితవు పలికారు. డిసెంబరు 4న సంధ్య థియేటర్‌లో ఆందోళనకర పరిస్థితి ఏర్పడిందని చిక్కడపల్లి ఏసీపీ రమేశ్‌ కుమార్‌ మీడియాకు తెలిపారు. తొక్కిసలాటలో ఒక మహిళ చనిపోవడంతో పాటు, ఒక బాలుడు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన విషయాన్ని వెల్లడించారు.

అల్లు అర్జున్‌ మేనేజర్‌ సంతోష్‌కు ఈ ఘటన గురించి సమాచారం ఇచ్చినప్పటికీ, ఆయన పోలీసులను కలిసి మాట్లాడేందుకు అడ్డుకుందని ఏసీపీ తెలిపారు. సీన్‌ను సమీక్షించిన తర్వాత, పోలీసులు తదుపరి చర్యలకు సిద్దమవుతున్నారు. ఎక్కడైనా ఇలాంటి ఘటనలు జరిగితే కఠిన చర్యలు ఉంటాయి. బౌన్సర్లు, సెలబ్రిటీ మేనేజ్‌మెంట్ బాధ్యతతో వ్యవహరించాలి అని కమిషనర్‌ అన్నారు. సెలబ్రిటీ ఈవెంట్లు నిర్విఘ్నంగా సాగాలంటే, ముందస్తు చర్యలు అవసరమని పోలీసులు స్పష్టంచేశారు. “ఒకవేళ తొక్కిసలాట ఏర్పడితే, బాధ్యులపై చర్యలుంటాయి” అని అన్నారు. ఈ ఘటన పట్ల అభిమానుల్లో, ప్రేక్షకుల్లో తీవ్ర నిరాశ వ్యక్తమవుతోంది. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవలసిన చర్యలపై పోలీసులు దృష్టి సారిస్తున్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870