हिन्दी | Epaper
రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్

దుబాయ్ కార్ రేసింగ్‏లో గెలిచిన అజిత్ టీమ్..

Divya Vani M
దుబాయ్ కార్ రేసింగ్‏లో గెలిచిన అజిత్ టీమ్..

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ ప్రస్తుతం దుబాయ్‌లో జరుగుతున్న కార్ రేసింగ్‌లో పాల్గొంటున్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటికే అజిత్ కార్ రేసింగ్‌లో పాల్గొన్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఇటీవల అజిత్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. అదృష్టవశాత్తు ఆయనకు స్వల్ప గాయాలు మాత్రమే అయ్యాయి.

ajith kumar
ajith kumar

సూపర్ హిట్ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన అజిత్ ఈ ఏడాది కొత్త విజయాన్ని సొంతం చేసుకున్నారు. దుబాయ్‌లో జరుగుతున్న 24 గంటల కార్ రేసులో తన జట్టుతో కలిసి భారత్‌కు ప్రాతినిధ్యం వహించారు. ఈ రేసులో అజిత్ టీమ్ హోరాహోరిగా పోటీపడి 901 పాయింట్లతో మూడో స్థానం దక్కించుకుంది. ఈ విజయం అజిత్ అభిమానులతో పాటు తమిళ సినీ పరిశ్రమలోనూ ఉత్సాహాన్ని నింపింది. జరిగిన ప్రమాదంలో స్వల్ప గాయాలు అయినా కూడా, అజిత్ ధైర్యంగా రేసులో పాల్గొని విజయాన్ని అందుకున్నారు. ఆయన అంకితభావానికి గుర్తింపుగా ‘స్పిరిట్ ఆఫ్ రేస్’ అవార్డు అందించబడింది. ఈ సందర్భంగా అజిత్ రేసింగ్‌కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.అజిత్ నటించిన ‘విదాముయార్చి’ సినిమా ఈ సంక్రాంతికి విడుదల కావాల్సి ఉన్నా, చిత్రయూనిట్ వాయిదా వేసింది. అజిత్‌కు సినిమాలతో పాటు కార్ రేసింగ్, బైక్ రేసింగ్‌పై గాఢమైన ఆసక్తి ఉంది.

ajith kumar
ajith kumar

షూటింగ్‌లకు విరామం దొరికితే బైక్‌పై ప్రపంచాన్ని చుట్టేందుకు సిద్ధమవుతారు.13 సంవత్సరాల తర్వాత మళ్లీ మోటార్ రేసింగ్‌లో పాల్గొనడం ఆయనకు ప్రత్యేకమైన అనుభూతిని కలిగించింది. రేసింగ్ కోసం చాలా రోజులుగా శిక్షణ తీసుకుంటున్న అజిత్ ఇటీవల ట్రాక్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు కారు ప్రమాదానికి గురయ్యారు. బ్రేక్ ఫెయిల్ కావడంతో గోడను ఢీ కొట్టింది. అయినప్పటికీ గాయాలను పట్టించుకోకుండా రేసులో తిరిగి పాల్గొని విజయం సాధించారు.అజిత్ జట్టు విజయంతో సినీ ప్రముఖులు, అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. శివకార్తికేయన్, మాధవన్, ప్రసన్న, దర్శకుడు మజీజ్ తిరుమేని, అధిక్ రవిచంద్రన్, వెంకట్ ప్రభు, నటి పార్వతి తదితరులు అజిత్‌కు శుభాకాంక్షలు తెలిపారు. అజిత్ స్పూర్తిదాయకమైన విజయం ఆయన అభిమానులకు మరింత గర్వకారణంగా మారింది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870