సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాల కోసం అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. గత ఏడాది సంక్రాంతికి విడుదలైన “గుంటూరు కారం” సినిమాతో ప్రేక్షకులను అలరించిన మహేష్ బాబు, ఆ తర్వాత కొత్త సినిమా ప్రకటించలేదు. అయితే, ప్రస్తుతం మహేష్ బాబు లెజెండరీ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో ఒక భారీ ప్రాజెక్ట్ కోసం సిద్ధమవుతున్నారు.సాధారణంగా దర్శకులు, రచయితలు కొన్ని కథలను ప్రత్యేకంగా కొన్ని హీరోలను దృష్టిలో పెట్టుకొని రాస్తుంటారు. అయితే కథ పూర్తయిన తర్వాత నిర్మాతల సూచనలతో ఇతర హీరోలను తీసుకోవడం కూడా జరుగుతుంది.

కానీ కొంతమంది దర్శకులు మాత్రం తామే ఎంపిక చేసిన నటుడితోనే కథను తెరకెక్కించడానికి మొగ్గు చూపుతారు.ఈ సందర్భంలో, ప్రముఖ దర్శకుడు కాశీ విశ్వనాథ్ ఒక అందమైన ప్రేమకథ రాశారు. ఈ కథకు మహేష్ బాబు అయితే బాగా సరిపోతారని నిర్మాత సురేష్ బాబు సూచించారు. అయితే కాశీ విశ్వనాథ్, తన కథకు లవర్ బాయ్ తరుణ్ అయితే మరింత కరెక్ట్‌గా సరిపోతాడని భావించి మహేష్ బాబును నెటుగా తిరస్కరించారు. అందుకే ఆయన తన ప్రేమకథను తరుణ్‌తో తెరకెక్కించారు. ఆ సినిమా పేరు “నువ్వు లేక నేను లేను“.2002 జనవరి 14న విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇందులో తరుణ్ సరసన హీరోయిన్‌గా ఆర్తి అగర్వాల్ నటించగా, వీరిద్దరి జోడీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.
ఈ సినిమాకు ఆర్పీ పట్నాయక్ అందించిన సంగీతం మరో హైలైట్. ప్రతి పాట ప్రేక్షకులను ఆకట్టుకుని సూపర్ హిట్ అయ్యింది. ఈ విజయం తరుణ్‌కు మరింత క్రేజ్‌ను తీసుకువచ్చింది.ఇక మహేష్ బాబు ప్రస్తుత ప్రాజెక్ట్ విషయానికి వస్తే, ఆయన రాజమౌళి దర్శకత్వంలో ఓ భారీ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తున్నట్టు సమాచారం. ఈ కాంబినేషన్ పై సినీప్రేమికులు భారీగా ఆశలు పెట్టుకున్నారు.మహేష్ బాబు సినిమాలపై ఉన్న క్రేజ్‌ను చూస్తే, ఆయన నటిస్తున్న ప్రతి సినిమా పట్ల ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడతాయి. ప్రస్తుతం మహేష్ – రాజమౌళి కాంబినేషన్‌పై కూడా అంతే స్థాయిలో హైప్ నెలకొంది.