ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 ప్రస్తుతం థియేటర్లలో దూసుకుపోతుంది. డిసెంబర్ 5, 2024న విడుదలైన ఈ సినిమా ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద రికార్డులను బద్దలు కొట్టింది. ఇప్పటివరకు ఈ చిత్రం దాదాపు ₹1900 కోట్ల వసూళ్లను సాదించింది. ఈ విజయంతో అల్లు అర్జున్ తన సోషల్ మీడియా వేదికగా ఒక ఎమోషనల్ పోస్ట్ చేశాడు. తన హృదయంలో ఒక సినిమా ప్రత్యేక స్థానం కలిగి ఉందని చెప్పాడు.స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన మరో హిట్ చిత్రం అల వైకుంఠపురములో కూడా ఆ ప్రేక్షకుల మన్ననలు అందుకుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో, పూజా హెగ్డే కథానాయికగా నటించిన ఈ సినిమా 2020 సంక్రాంతి కానుకగా విడుదలై అద్భుతమైన విజయాన్ని సాధించింది.
ఈ చిత్రం అల్లు అర్జున్ మరియు త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన మూడవ సినిమా. డైలాగ్స్, యాక్టింగ్, పాటలు అన్నీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.ఈ సినిమాలో నివేదా పేతురాజ్, టబు, సుశాంత్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా విడుదలై ఐదు సంవత్సరాలు గడిచిన సందర్భంగా, అల్లు అర్జున్ తన సోషల్ మీడియా ఖాతాలో ఆ రోజులను గుర్తు చేసుకుంటూ పోస్ట్ చేశారు. “ఈ సినిమా నా హృదయంలో ఎప్పటికీ ప్రత్యేక స్థానం కలిగి ఉంటుంది” అని ట్వీట్ చేశారు.ఇందులోని డైరెక్టర్ త్రివిక్రమ్, చినబాబు, అల్లు అరవింద్, తమన్ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
ఈ అద్భుతమైన చిత్రం కోసం పనిచేసిన నటీనటులు, సిబ్బంది మరియు అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేశారు. బన్నీ పంచుకున్న ఆ సినిమాకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఈ సినిమాలో తమన్ అందించిన సంగీతం మరో హైలైట్. ఈ పాటలు ఇప్పటికీ చాలావరకు గానంగా వినిపిస్తూనే ఉన్నాయి. ఇక, పుష్ప 2 ప్రస్తుతం పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద ₹2000 కోట్ల మార్క్ చేరుకోవడానికి దూసుకుపోతుంది.