हिन्दी | Epaper

Latest News: Tiruveer: తండ్రయిన నటుడు తిరువీర్

Anusha
Latest News: Tiruveer: తండ్రయిన నటుడు తిరువీర్

టాలీవుడ్ యంగ్ హీరో తిరువీర్ (Tiruveer) తండ్రయ్యారు. ఈ విషయాన్ని తిరువీర్ సోషల్ మీడియా వేేదికగా వెల్లడించారు.. ‘నాయన వచ్చిండు’ అంటూ ఆనందం వ్యక్తం చేశారు. దీంతో తిరువీర్‌కు పలువురు సెలబ్రిటీలతో పాటు ఫ్యాన్స్‌, నెటిజన్లు విషెష్ చెబుతున్నారు.తిరువీర్ (Tiruveer) గతేడాది కల్పన అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు. ఈ ఏడాది మార్చిలో సొంతూరిలో తన కొత్తింటి కలను నిజం చేసుకున్నారు.

Read Also: Akhanda 2: ‘అఖండ 2’ మూవీ రివ్యూ

తెలుగు ప్రేక్షకులకు తిరువీర్ సుపరిచితులు

అప్పట్లో ‘రెండు దశాబ్దాల కల, అమ్మ చివరి కోరిక’ అంటూ తన ఇంటి ఫోటోలను నెట్టింట పంచుకున్నారు. ఆగస్టులో తన భార్య కల్పన సీమంతం వేడుక చేశారు. తాజాగా ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. జార్జ్ రెడ్డి, పలాస 1978, మసూద చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు తిరువీర్ సుపరిచితులు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870