తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్ (Siva Karthikeyan) సినిమాల్లో మాత్రమే కాదు, నిజ జీవితంలోనూ మానవత్వానికి పెద్ద పీట వేస్తూ అభిమానుల మనసులు గెలుచుకుంటున్నారు. తాజాగా వండలూర్ జూ పార్క్‌లోని ఓ ఏనుగును ఆయన దత్తత తీసుకున్నారు.. ఈ విషయం జూ పార్క్ అధికారులు అధికారికంగా ప్రకటించడంతో వెలుగులోకి వచ్చింది. ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు.
Read Also: Chiranjeevi: ‘రికార్డులు వస్తుంటాయి.. పోతుంటాయి’: చిరు ఎమోషనల్

మూగ జీవాలపై ప్రేమ
కాగా శివ కార్తికేయన్ (Siva Karthikeyan) ఇలా జంతువులను దత్తత తీసుకోవడం ఇదేమీ మొదటి సారి కాదు. గతంలోనూ పలు సార్లు వివిధ జంతువులను దత్తత తీసుకుని వాటి బాగోగులు చూసుకున్నారు. ఇప్పుడు ఏకంగా ఏనుగును దత్తత తీసుకుని మూగ జీవాలపై తన ప్రేమను చాటుకున్నాడు ఆయన..
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: