‘టూరిస్ట్ ఫ్యామిలీ’ చిత్రంతో దర్శకుడిగా సినీ రంగంలో అడుగు పెట్టిన యువ దర్శకుడు అభిషన్ (Abishan Jeevinth) ఇప్పుడు తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించాడు. సినిమా ప్రీ-రిలీజ్ వేడుకలోనే ఆయన తన ప్రేయసి అక్కీలకు చేసిన ప్రపోజల్ అందరినీ ఆశ్చర్యపరిచింది. “అక్టోబర్ 31న నన్ను పెళ్లి చేసుకుంటావా?” అంటూ పబ్లిక్‌లోనే ప్రేమను వ్యక్తం చేసిన అభిషన్ (Abishan Jeevinth) మాట నిలబెట్టుకున్నాడు.
Read Also: Telugu Bigg Boss-9: ముదిరి పాకాన పడ్డ రీతూ పవన్ ల ప్రేమ
చెప్పిన తేదీ ప్రకారమే ఈ రోజు తన ప్రియురాలు అక్కీలను వివాహం చేసుకున్నాడు.ఈ పెళ్లి వేడుకలో కుటుంబ సభ్యులు, స్నేహితులు, సినీ ప్రముఖులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. వివాహ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ జంటకు అభిమానులు, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్లు పెడుతున్నారు. “సెలబ్రిటీ లవ్ స్టోరీకి హ్యాపీ ఎండింగ్” అంటూ నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
అద్భుతమైన బహుమతి
మరోవైపు ఈ యువ దర్శకుడికి ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ చిత్ర నిర్మాత మాగేశ్ రాజ్ పాసిలియన్ (Magesh Raj Pasilian) ఒక అద్భుతమైన బహుమతి ఇచ్చారు. తమ తొలి చిత్రానికి మెగా విజయాన్ని అందించినందుకు కృతజ్ఞతగా ఆయన అభిషన్‌కు లగ్జరీ బీఎండబ్ల్యూ (BMW) కారును వెడ్డింగ్ గిఫ్ట్‌గా అందించారు.
దర్శకుడిగా మెప్పించిన అభిషన్ ఇప్పుడు నటుడిగా మెప్పించేందుకు సిద్ధమవుతున్నారు. మలయాళ నటి అనస్వర రాజన్ (Anaswara Rajan) తో కలిసి హీరోగా నటిస్తున్న తన తదుపరి చిత్రం షూటింగ్ కూడా పూర్తయింది. రజనీకాంత్ కుమార్తె సౌందర్య రజనీకాంత్ (Soundarya Rajinikanth) నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: